Share News

High Court: మా ముందు హాజరై వివరణ ఇవ్వండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:23 AM

కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం అప్పటి తహశీల్దార్‌ వనజాక్షిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

High Court: మా ముందు హాజరై వివరణ ఇవ్వండి

కోర్టు ధిక్కరణ కేసులో తహశీల్దార్‌ వనజాక్షికి హైకోర్టు ఆదేశం

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం అప్పటి తహశీల్దార్‌ వనజాక్షిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. గోపాలపురం మండలం, భీమోలులోని 359 ఎకరాలను వివాద రిజిస్టర్‌లో చేర్చాలని గత ఏడాది మార్చి 12న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తహశీల్దార్‌ అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డారంటూ కరిబండి సూర్యకుమారి, పోతిరెడ్డి వీరరాఘవమ్మవేసిన పిటిషన్‌ గురువారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ల న్యాయవాది పి.నాగేందర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. తహశీల్దార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కోరారు.

Updated Date - Mar 21 , 2025 | 05:23 AM