Share News

DA Hike 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:46 PM

ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చింది. 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, కరువు భత్యం (DA)లో 2 శాతం పెంపుదలకి ఆమోదం లభించింది.

DA Hike 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన
CentralGovernmentEmployees

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం(DA)లో 2 శాతం పెంపుదలకు ఆమోదం లభించింది. ఈ సవరణతో, కేంద్ర ఉద్యోగుల డీఏ 53% నుంచి 55%కి పెరిగింది. ఇది 8వ వేతన సంఘం అంచనా కంటే ముందు ఉద్యోగుల జీతం పెరుగుతుంది. దీనికి ముందు చివరిసారిగా జూలై 2024లో జీతాల పెంపు జరిగింది. అప్పుడు డీఏను 50% నుంచి 53%కి పెంచారు.


కొత్త డీఏ ప్రకారం జీతం ఎంత పెరుగుతుంది

ఈ క్రమంలో ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై వారి వేతనంలో మార్పులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ వేతనాల్లో ఎలా మార్పులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. రూ.50,000 జీతం ఉన్న వారికి 53% డీఏతో రూ.26,500 కరవు భత్యం లభిస్తుంది. 55% డీఏతో రూ. 27,500కి చేరుతుంది. అంటే రూ. 1,000 పెరుగుతుంది. రూ. 70,000 వేతనం ఉన్న వారికి 53% డీఏతో రూ. 37,100 కరవు భత్యం లభించగా, 55% డీఏతో రూ. 38,500 రానుంది. ఈ మార్పుతో రూ. 1,400 పెరుగుతుంది.


78 నెలల తర్వాత ఈ మార్పు

గత 6.6 సంవత్సరాల నుంచి డియర్నెస్ అలవెన్స్ (DA) ప్రతి సంవత్సరం 3% లేదా 4% పెరుగుతుండేది. కానీ ఈసారి 2% మాత్రమే పెరిగింది. ఇది చాలా అరుదని చెబుతున్నారు. 2018 ప్రారంభంలో 2% పెరిగిన తరువాత, 3% లేదా 4% పెరుగుదల సాధారణంగా కొనసాగింది. ఇది ఉద్యోగుల జీతాలలో కొంత మాత్రమే పెరుగుదలను చూపిస్తుంది.


బకాయిలు 2 నెలల పాటు

మార్చి నెలలో ప్రభుత్వం కరువు భత్యం పెంపును ప్రకటించింది. అలాంటప్పుడు, రెండు నెలల బకాయిలను కలిపి మార్చి నెల జీతంతో పాటు ఇస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలలతో పాటు, మార్చి నెలకు సంబంధించిన కరువు భత్యాన్ని కూడా జీతంలో చేర్చి ఉద్యోగుల ఖాతాకు పంపిస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల జీతం రూ. 19,000 ఉంటే, వారికి రూ. 10,070 డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది. ఇప్పుడు 2 శాతం పెరుగుదల తర్వాత, ఈ భత్యం రూ.10,450గా మారింది.


డీఏ పెంపుదల వల్ల ఎవరికి ప్రయోజనం

డీఏ (DA) అనేది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు పెరిగిన జీవన వ్యయం కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి అందించే ముఖ్యమైన భత్యం. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ జీతాలు వారి విలువను కోల్పోకుండా ఉంచడానికి డీఏ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ పెంపు ప్రాథమిక జీతాలకు సంబంధించి 10 సంవత్సరాలకోసారి పే కమిషన్ నిర్ణయిస్తుంది. డీఏ కాలానుగుణంగా సర్దుబాటు చేస్తారు. దాంతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుంది. డీఏ పెంపుదల ద్వారా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు.


ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:06 PM