Share News

అడుగంటిన కన్నెలవాగు చెరువు

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:36 PM

రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటిపోతుండడం తో కన్నెలవాగు చెరువు నీరులేక వెలవెలబోతోం ది.

అడుగంటిన కన్నెలవాగు చెరువు
నీరులేక వెలవెలబోతున్న కన్నెలవాగు చెరువు

ఆందోళనలో ఆయకట్టు రైతులు ఎమ్మెల్యే పుట్టా చొరవ చూపాలంటున్న జనం తాగునీటికి కష్టాలు తప్పవంటున్న వైనం

ఖాజీపేట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటిపోతుండడం తో కన్నెలవాగు చెరువు నీరులేక వెలవెలబోతోం ది. చెరువులో గుంతల్లో మాత్రమే నీరు కొద్దిగా ఉండడంతో వేసవి ఎండలకు అవికూడా అడు గంటుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఖాజీపేట మండల పరిధిలోని సీతానగరం సమీపంలోగల కన్నెలవాగు చెరువుకు కొండల్లో వర్షం కురుస్తూనే నీరు వస్తుంది. గత రెండు సంవత్సరాలుగా వర్షం సరిగా పడకపోవడంతో చెరువు నిండలేదు. ఈ చెరువు కింద దాదాపు రెండు వేల ఎకరాలు సాగులో ఉంది.

పది గ్రామాలకు ఆ చెరువే దిక్కు

కన్నెలవాగు చెరువు నీరు మండల పరిధిలోని కూనవారిపల్లె, సీతానగరం, పాటిమీదపల్లె, కొత్తపేట, చెన్నముక్కపల్లె, కొత్తనెల్లూరు, ముళ్లపాకు, చెముళ్లపల్లె తదితర పది గ్రామాలకు కల్పతరువుగా ఉంటోంది. చెరువులో పుష్కలం గా నీరుంటే గ్రామాల్లోని బోరుబావులకు నీరు వస్తుంది. దీంతో ఆయకట్టుకు నీరులభిస్తుంది.

ఎమ్మెల్యే చొరవ చూపి చెరువు నింపాలి

మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ చొరవ చూపి కన్నెలవాగు చెరువుకు తెలుగుగంగ నీటిని తరలించి నింపాలను ప్రజ లు కోరుతున్నారు. గతంతో ప్రతిపక్షంలో ఉండగా చెరువుకు నీరు ఇచ్చి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రైతుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా ఇటీవల నియోజకవర్గంలోని మైదుకూరు చెరువులకు రెండోసారి నీరు సరఫరా చేయించి నింపిన విధంగానే కన్నెలవాగుచెరువుకు కూడా నీరు నింపాలను ప్రజలు, ఆయ కట్టు రైతులు కోరుతున్నారు. చెరువుకు నీరు వస్తే తాగునీటికి కష్టాలుండవం టున్నారు.

నీటి వృథాను తక్షణం అరికట్టాలి

చెరువు కట్టకింద తెలుగుగంగ కాలువ ఉండడంతో చెరువులోని నీరంతా లీకేజీ అయి కాలువగుండా వృథాగా పోతోందని ప్రజలు వా పోతున్నారు. ప్రభుత్వం మరమ్మతులు చేపడితే గ్రామాలకు నీటి ఎద్దడి ఉండదంటున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:36 PM