గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:24 PM
ప్ర స్తుత ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చింది.

పోరుమామిళ్ల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్ర స్తుత ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా పోరుమామిళ్ల మండలంలో రూ.2 కోట్ల 63లక్షలతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఆ పనులను పూర్తి చేసింది. మరలా రూ.2 కోట్ల 90 లక్షలకు ప్రతిపాదనలు కూడా పం పింది. దీంతో కొన్ని వీధుల్లో, గ్రామాల్లో సిమెం టు రోడ్ల నిర్మాణం జరగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి న తర్వాత పోరుమామిళ్ల మండలంలో మా ర్కాపురం, క్రిష్ణంపల్లెతో పాటు మరికొన్ని వీధు ల్లో సిమెంటురోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఉన్న దమ్మనపల్లె వెళ్లే రహదారి నిర్మాణానికి గత వైసీపీ హ యాంలో రూ.74 లక్షలు నిధులు మంజూరై కూడా నిధులు లేని కారణంగా ఆ పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ చుట్టుపక్కల నాలు గు గ్రామాల ప్రజలు సుమారు నాలుగు కిలో మీటర్లు వెళ్లాలంటే నరకయాతన పడాల్సివ చ్చింది ప్రస్తుతం రూ. 95లక్షలతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు.అలాగే బుచ్చంపల్లె ప్రాంతంలో రూ.35 లక్షల తో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. పోరు మామిళ్ల, రంగసముద్రం మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అవి జిల్లా కలెక్టర్ వద్ద ఆమోదం పొందాల్సి ఉంది. ఆమోదం లభిస్తే మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం జరిగే అవకాశాలున్నాయి.