Share News

చె‘మిర్చి’న కళ్లు

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:04 AM

తప్పుల మీద తప్పులు.. అప్పుల మీద అప్పులు.. జగ్గయ్యపేటలోని తిరుమలగిరి కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యం చేసిన నిర్వాకాల కారణంగా రైతుల గుండెల్లో ఆరని మంటలు రేగుతున్నాయి. రైతుల పేరిట బ్యాంకుల్లో రూ.కోట్ల రుణాలు తీసుకోవడం, తిరిగి వారికే వాటిని అధిక వడ్డీకి అప్పుగా ఇవ్వడం, దొరికిన ప్రతిచోటా రుణాలు తీసుకోవడం, కనీసం ఇన్సూరెన్స్‌ను కూడా పునరుద్ధరించకపోవడం, పరిమితికి మంచి సరుకును నిల్వ చేయడం వంటి యాజమాన్య నిర్లక్ష్య వైఖరుల కారణంగా ఇప్పుడు అమయాక అన్నదాతలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.

చె‘మిర్చి’న కళ్లు
కోల్డ్‌ స్టోరేజీ భవనం నుంచి వస్తున్న పొగ

కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాదంతో రైతుల గుండెల్లో ఆరని మంటలు

సరుకు నిల్వ ఉన్నా ఇన్సూరెన్స్‌ పునరుద్ధరించని యాజమాన్యం

ఇప్పటికే రూ.6.63 కోట్ల అప్పు.. మరో రూ.10 కోట్ల రుణానికి దరఖాస్తు

రైతుల బాండ్లను తాకట్టు పెట్టి భారీ రుణాలు

అదే డబ్బు అధిక వడ్డీకి తిరిగి రైతులకు..

పరిమితికి మించి స్టోరేజీలో సరుకు నిల్వ

స్టాక్‌, మూవ్‌మెంట్‌ రిజిస్టర్లు మాయం

ప్రభుత్వం న్యాయం చేయాలని రైతుల వేడుకోలు

(ఆంధ్రజ్యోతి, జగ్గయ్యపేట) : తిరుమలగిరి అగ్రి కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్య నిర్వాకం కారణంగా మిర్చి రైతులు సర్వం కోల్పోయారు. నష్టాన్ని పూడ్చే అన్ని దారులూ వారికి మూసుకుపోయాయి. ఇన్సూరెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అగ్ని ప్రమాదం సంభవించక ముందే ఇన్సూరెన్స్‌ గడువు పూర్తై పోయింది. యాజమాన్యం ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పాటు నిర్వాహకులు ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులు, పంటపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం వంటివి రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ నిర్వాహకుల నుంచి డబ్బు కట్టిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. మార్కెటింగ్‌ శాఖ గణాంకాల ప్రకారం.. తిరుమలగిరి అగ్రి కోల్డ్‌ స్టోరేజీలో 385 మంది రైతులు తమ మిర్చి పంటను ఉంచారని తెలుస్తోంది. వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట, మంగొల్లు, శింగవరం తదితర గ్రామాలతో పాటు తెలంగాణాలోని దొండపాడు గ్రామం

రిజిస్టర్లు మాయం

కోల్డ్‌ స్టోరేజీలో అనధికారికంగా కూడా సరుకును నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. స్టోరేజీ రిజిస్టర్లతో పాటు మూవ్‌మెంట్‌ రిజిస్టర్లను కూడా యాజమాన్యం మాయం చేసింది. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. యాజమాన్యం అనధికారికంగా పరిమితికి మించి నిల్వలు ఉంచినట్టుగా అనుమానాలు నెలకొంటున్నాయి. కోల్డ్‌ స్టోరేజీ సామర్థ్యం కేవలం 80 వేల టిక్కీలకే సరిపోతుంది. మొత్తం ఎకరం భూమిలో 40 సెంట్ల విస్తీర్ణంలో కోల్డ్‌ స్టోరేజీని నిర్మించారు. పరిమితికి మించి మిర్చిని నిల్వ ఉంచిన విషయం వెలుగులోకి రాకుండా ఉండేందుకు యాజమాన్యం రిజిస్టర్లను మాయం చేసిందని తెలుస్తోంది.

అందిన ప్రతిచోటా అపు

కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ యాజమాన్యం అందిన ప్రతిచోటా అప్పులు చేసిందని తెలుస్తోంది. ఒక జాతీయ బ్యాంక్‌ నుంచి రూ.6.63 కోట్ల అప్పును తీసుకున్నట్టు సమాచారం. ఈ అప్పుతో పాటు మరో రూ.10 కోట్ల రుణాన్ని తీసుకోవటానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. రైతులు కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌లో సరుకును ఉంచినపుడు వారికి నిర్వాహకులు బాండ్లు ఇస్తారు. ఈ బాండ్లపై రైతులు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునే అవకాశం ఉంటుంది. తిరుమలగిరి కోల్డ్‌ స్టోరేజీ నిర్వాహకులు మాత్రం మిర్చి రైతులకు ఇవ్వాల్సిన బాండ్లను తమ దగ్గరే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. స్వల్ప సంఖ్యలోనే రైతులకు బాండ్లను ఇచ్చినట్టు సమాచారం. తమ దగ ్గర ఉన్న బాండ్లను బ్యాంకులో పెట్టి రూ.10 కోట్ల రుణాన్ని తీసుకోవటానికి దరఖాస్తు చేసినట్టుగా సమాచారం. రుణం కూడా మంజూరైనట్టు తెలుస్తోంది. నుంచి కూడా రైతులు ఇక్కడ పెద్ద సంఖ్యలో మిర్చిని నిల్వ ఉంచినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ రేటు వస్తుందన్న ఉద్దేశంతో రైతులు ఈ కోల్డ్‌ స్టోరేజీని ఎంచుకున్నారు. రైతులు చెబుతున్న దాని ప్రకారం.. 40 వేల టిక్కీలు ఇక్కడ నిల్వ ఉంచినట్టుగా తెలుస్తోంది. కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యం పరారయ్యే ముందు స్టాక్‌ రిజిస్టర్‌తో పాటు మూవ్‌మెంట్‌ రిజిస్టర్లను కూడా తరలించేసింది. దీంతో వాస్తవంగా ఎన్ని టిక్కీల మిర్చి ఉంటుందన్నది తేలట్లేదు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు రైతుల నుంచి సేకరిస్తున్న వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం వరకు 14 వేల టిక్కీలకు సంబంధించి లెక్క తేలినట్టుగా తెలుస్తోంది. సర్వే పూర్తయితే కానీ పూర్తి వివరాలు వెల్లడికావు. ఈ నేపథ్యంలో వత్సవాయి మండలంలోని గ్రామాల్లోని రైతుల ఇళ్లకు నేరుగా వెళ్లి వివరాలు నమోదు చేయాలని వీఆర్వోలకు ఆదేశాలు అందాయి.

ఇన్సూరెన్స్‌ లేక ఇక్కట్లు

కోల్డ్‌ స్టోరేజీ ఇన్సూరెన్స్‌ ముగియడంతో రైతులకు నయాపైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది కోల్డ్‌ స్టోరేజీ నిర్వాహకుల తప్పిదమే. ఇన్సూరెన్స్‌ ముగిసిన విషయం తెలిసి కూడా దానిని పునరుద్ధరించటానికి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పునరుద్ధరణకు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండటంతో ఆ పని చేయలేదని తెలుస్తోంది. కనీసం రైతుల నుంచి 80 వేల టిక్కీల మిర్చీని తీసుకున్నప్పుడైనా నిర్వాహకులు ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరించాల్సి ఉన్నా ఆ పని కూడా చేయలేదు. దీంతో ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలేమీ కనిపించట్లేదు. యాజమాన్యానికి ఇన్సూరెన్స్‌ వచ్చినా.. అందులో కొంతమేర అయినా రైతులకు ప్రయోజనం అందే అవకాశం ఉండేది.

Updated Date - Mar 27 , 2025 | 01:04 AM