Share News

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:33 AM

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, బూరగడ్డ వేదవ్యాస్‌ తదితరులు

వన్‌టౌన్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, ఉడా మాజీ చైర్మన్‌ తూమాటి ప్రేమనాథ్‌, పలువురు నాయకులతో కలిసి పార్టీ జెండాను నెట్టెం ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. టీడీపీ ఆవిర్భావం తెలుగు సమాజంలో సామాజిక విప్లవాన్ని రగిల్చిందన్నారు. నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. లుక్కా సాయిరామ్‌ ప్రసా ద్‌ గౌడ్‌, కొత్త నాగేంద్ర కుమార్‌(నాగబాబు), ఎస్‌.శివరామప్రసాద్‌గౌడ్‌, చెన్నుపాటి ఉషారాణి, వల్లూరి ఉషారాణి పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ భవన్‌లో..

గురునానక్‌ కాలనీలోని విజయవాడ పార్లమెంట్‌ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ జెండాను ఎగురవేశారు. 43 ఏళ్ల క్రితం టీడీపీ స్ధాపనతో రాజకీయ ఉద్యమం మొదలైందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. పార్టీకి బలం, బలగం కార్యకర్తలే అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 120 మం దికి పైగా సీనియర్‌ కార్యకర్తలను ఎంపీ కేశినేని చిన్ని సన్మానించారు.

Updated Date - Mar 30 , 2025 | 01:33 AM