జగన్ ప్రభుత్వం కాదిది
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:19 AM
గుడ్లవల్లేరు ఇరిగేషన్ బంగ్లాలో డీసీలు, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులతో తూర్పు కృష్ణా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

కూటమి ప్రభుత్వమని అధికారులు, కాంట్రాక్టర్లు గుర్తెరిగి పనిచేయాలి
అసంపూర్తి ఇరిగేషన్, డ్రెయినేజీ పనులన్నీ పూర్తి చేయాలి
డీసీలు, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులతో సమీక్షలో తూర్పు కృష్ణా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు
గుడ్లవల్లేరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ప్రభుత్వం కాదిది. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు అంద రూ అది గుర్తెరిగి పనిచేయాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్ల, అప్పట్లో అధికారుల అలసత్వం కారణంగా కాంట్రాక్టర్లు సరిగా పనిచేయక కృష్ణాడెల్టాలో ఇరిగేషన్, డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా నిర్వహించారు. రైతులను కష్టాల పాల్జేశా రు. రాబోయే రోజుల్లో రైతులకు ఏ ఇబ్బందీ కలగకుండా పనులన్నీ చేయాలి.’ అ ని తూర్పుకృష్ణా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం గుడ్లవల్లేరు ఇరిగేషన్ బంగ్లాలో డీసీలు, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులతో ఆయ న సమీక్ష నిర్వహించారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ పనులు అత్యవసరం, ప్రాధాన్య క్రమంలో ఏ పనులు ముందుగా చేయాలనే దానిపై చర్చించారు. ఇరిగేషన్, డ్రెయినేజీలకు సంబంధించిన ఏ సమస్యనైనా తన దృష్టికి తేవాలని పీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు సూచించారు. రైతులకు అధికారులకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేసి రైతాంగానికి మంచి జరిగేలా చూస్తానన్నారు. ఆంధ్రజ్యోతిలో ‘పుల్లేరులో తూడు తొలగించరూ’ పేరుతో ప్రచురితమైన కథనాన్ని పీసీ చైర్మన్ దృష్టికి నీటి సంఘం అధ్యక్షుడు శాయన ప్రసాద్ తెచ్చారు. పుల్లేరులో ఎగువ నుంచి వస్తు న్న మురుగునీటిని గుడ్లవల్లేరు లాకులవద్ద నిలువపెట్టడంతో లాకుల నుంచి మామిడికోళ్ల వరకూ తూడు పెరిగిపోయిందని, లాకుల వద్ద నీరు తగ్గించి తూడు నిర్మూలించే సమయంలో కాంట్రాక్టరుతో పని చేయించడంలేదని వివరించారు. వడ్లమన్నాడులో వడ్లమన్నాడు డ్రెయిన్‌ను అధికారులు, డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యేశ్వరచౌదరితో కలిసి పీసీ చైర్మన్ పరిశీలించారు. వడ్లమన్నాడు డ్రెయిన్ అధ్వానంగా ఉందని వెంటనే దానిని తవ్వించాలని అధికారులకు సూచించారు. డీసీ చైర్మన్ పాలేటి వెంకటవీర ఆంజనేయిలు, వైస్ చైర్మన్లు వీరమాచనేని నాగజయరాం, పోతురాజు, టీడీపీ నాయకులు అడుసుమిల్లి రామ్మోహనరావు, బొర్రా నాగేశ్వరరావు, ఇరిగేషన్ డీఈ ఎస్.శ్రీను, జేఈలు లక్ష్మీతులసి, కె.నిర్మల, డ్రెయినేజీ ఈఈ కిరణ్‌బాబు, ఏఈ నాగేశ్వరరావు, కుమార్, లాక్ సూపరింటెండెంట్ దావీద్ తదితరులు పాల్గొన్నారు.