Share News

గుడివాడలో ‘ఆపరేషన్‌ గరుడ’

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:15 AM

గుడివాడలో నూ శుక్రవారం ఈగల్‌ టీమ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీసులు, డ్రగ్‌ డిపార్టుమెంట్‌ అధికారుల ఆధ్వర్యంలో మెడికల్‌ షాపులు, మెడికల్‌ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు.

గుడివాడలో ‘ఆపరేషన్‌ గరుడ’

మెడికల్‌ షాపుల్లో అధికారుల తనిఖీలు

గుడివాడ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్‌ గరుడ కార్యక్రమంలో భాగంగా గుడివాడలో నూ శుక్రవారం ఈగల్‌ టీమ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీసులు, డ్రగ్‌ డిపార్టుమెంట్‌ అధికారుల ఆధ్వర్యంలో మెడికల్‌ షాపులు, మెడికల్‌ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు. భీమవరం రైల్వేగేటు పక్కన ఉన్న పాత డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వ ర ఆస్పత్రిలోని మెడికల్‌ షాపు, ఏలూరురోడ్డులోని షణ్ముఖ ఏ జెన్సీపై సమాచారం బయటకు రాకుండా పకడ్బందీగా దాడు లు చేశారు. రెండు రోజులుగా గుడివాడలోని పలు ఆస్పత్రుల్లోని మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేసినట్టు సమాచారం.

Updated Date - Mar 22 , 2025 | 12:15 AM