Share News

సజావుగా పదో తరగతి పరీక్షలు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:20 AM

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నా యని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

సజావుగా పదో తరగతి పరీక్షలు
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

సజావుగా పదో తరగతి పరీక్షలు

కర్నాటి రామ్మోహనరావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ లక్ష్మీశ

కలెక్టరేట్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నా యని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహన రావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు పరీక్ష రాసేందుకు పాఠశాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. తాగునీటికి, ఇతర వసతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యుత్‌ సరఫరాలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, ప్రాథమిక చికిత్సకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ మార్గ దర్శకాలను తప్పకుండా పాటించాలని, భద్రతతో పాటు చెక్‌లిస్టు ప్రకారం అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వుండాలని అధికారులకు, సిబ్బందికి కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Mar 22 , 2025 | 12:20 AM