తెలుగుజాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:06 AM
తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉద్ఘాటించారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 1982లో తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో అన్న ఎన్టీఆర్ ప్రా రంభించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లలను ఎదుర్కొని తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిందని పేర్కొన్నారు.

పోరంకి మునిసిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన బోడె ప్రసాద్
తెలుగుజాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ
పెనమలూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉద్ఘాటించారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 1982లో తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో అన్న ఎన్టీఆర్ ప్రా రంభించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లలను ఎదుర్కొని తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రపంచపటంలో తెలుగుజాతికి ఒక స్థానాన్ని కల్పించిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులదేనన్నారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని పార్టీని సమర్ధవంతంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యువకిశోరం లోకేశ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి ఎన్నో ఏళ్లుగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను సత్కరించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతి కోసమే టీడీపీ ఆవిర్భావం
గన్నవరం : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని గన్నవరం టీడీపీ కార్యాలయంలో శని వారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, టీడీపీ టౌన్ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, దొంతు చిన్న, చిరుమామిళ్ల సూర్యం, మేడేపల్లి రమ, గూడవల్లి నరసయ్య, ఆళ్ల గోపాలకృష్ణ, కొల్లా ఆనంద్, జాస్తి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేసరపల్లిలో మాజీ ఎమ్మెల్యే మూల్పూరి బాలకృష్ణరావు, జాస్తి విజయభూషణ్‌కుమార్, ఉపసర్పంచ్ జాస్తి శ్రీధర్ పాల్గొన్నారు.
ఫటీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ పొట్లూరి బసవరావు, ప్రముఖ న్యాయవాది కేవి రమణ, జూపల్లి సురేష్, మండవ లక్ష్మీ, చిక్కవరపు నాగమణి, మండవ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్ : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక మూలకొట్టు సెంటర్, తారకరామ నగర్ జంక్షన్ పట్టణ కార్యాలయంలో టీడీపీ జంక్షన్ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహాక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, నాయకులు వీరమా చనేని సత్యప్రసాద్, వీరమాచనేని బుజ్జి, గార్లపాటి రాజేశ్వర రావు,వడ్డిల్లి లక్ష్మీ,మేడేపూడి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీతోనే ప్రగతి..ప్రజా సంక్షేమం..
హనుమాన్‌జంక్షన్‌రూరల్ : టీడీపీతోనే ప్రగతి, ప్రజా సంక్షేమం సాధ్యమని టీడీపీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, వేము లపల్లి శ్రీనివాసరావు, లంక సురేంద్ర మోహనబెనర్జీ తదితరులు అన్నారు. బాపులపాడు మండల వ్యాప్తంగా శనివారం నిర్వహిం చిన టీడీపీ 43 వసంతాల పండుగను సందర్భంగా గ్రామాల్లో పసుపు జెండా రెపరెప లాడింది. వీరవల్లి, రంగన్నగూడెం, కోడూ రుపాడు, కొత్తపల్లి, వేలేరు, కాకులపాడు, రంగయ్య ప్పారావుపే ట, మల్లవల్లి, బొమ్ములూరులో టీడీపీ జెండాలను ఎగురవేశారు.
పేదరికంలేని సమాజమే ధ్యేయంగా..
ఉయ్యూరు : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరిం చు కుని శనివారం ఉయ్యూరు, మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆకునూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు మండల పార్లీ అఽధ్యక్షుడు కుటుంబరావుతో కలసి శుంకు స్థాపన చేశారు. వల్లభనేని సత్యనారాయణ, కాకాని శ్రీనివాస రావు, ఫణి, సాయి, అజ్మతుల్లా, తెలుగుయువత జిల్లా అధ్యక్షు డు దండమూడి చౌదరి పాల్గొన్నారు.
కంకిపాడు : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ఉన్నత సిద్ధాంతాలతో పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కంకిపాడులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను సత్కరించారు. ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి, యలమంచిలి కిషోర్‌బాబు పాల్గొన్నారు.