Share News

కౌలు రైతులకు సమగ్ర చట్టం చేయాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:51 AM

కైలు రైతుల సంక్షేమం కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి కె.జగన్నాథం డిమాండ్‌ చేశారు.

కౌలు రైతులకు సమగ్ర చట్టం చేయాలి
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న నాయకులు

కర్నూలు న్యూసిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కైలు రైతుల సంక్షేమం కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి కె.జగన్నాథం డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 80శాతం మంది భూము లను కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి వారికి ప్రభుత్వ నుంచి ఎలాంటి సహకారం అందడంలేద న్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, బ్యాంకులలో పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు పంపన్న గౌడు, తిమ్మయ్య, సహాయ కార్యదర్శి డి.శ్రీనివాస రావు, సీపీఐ నగర కార్య దర్శి రామక్రిష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి మహేష్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి: ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్కావెంజర్స్‌కు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వ పాఠశాల శానిటేషన వర్కర్స్‌ యూనియన జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఆయాలు, స్కా వెంజర్స్‌ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లా డుతూ స్కావెంజర్స్‌కు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10వేల వేత నం ఇవ్వాలన్నారు. మెడికల్‌ లీవ్‌లు ఇవ్వడంతోపాటు ఆయాలకు ఇత ర ఆఫీసులకు డ్యూటీలు వేయడం మానుకోవాలన్నారు. అనంతరం కలె క్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సురేఖ, బి.స్వర్ణ, సునీత, మహేశ్వరి, నాగమణి, మేరి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

ఫ జోహరాపురం పరిధిలోని రెవెన్యూ వక్ఫ్‌బోర్డు భూమిలో పేద ముస్లింలకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ, ఇన్సాఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోహరాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో 154 సర్వే నెంబరులో వక్ఫ్‌బోర్డు భూమి 12 ఎకరాల 49 సెంట్లు ఉందన్నారు .ఇప్పటికే 6 ఎకరాలు కబ్జాకు గురైందన్నారు. మిగిలిన 6 ఎకరాలను కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జాచేసి ప్లాట్లు వేసుకోవాలని చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఇన్సాఫ్‌ నాయకుడు అన్వర్‌ సీపీఐ నగర సహాయ కార్యదర్శులు మహేష్‌, శ్రీనివాసరావు, శ్రావణిరెడ్డి, నాగేంద్రమ్మ, భారతి, ఆశాబేగం పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 12:51 AM