Share News

అభ్యంతరాలు ఉంటే తెలపాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:07 AM

నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల ఆధునీకరణ, కొత్త కేంద్రాల గుర్తింపు, ఓటరు నమో దులో ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, మంత్రాలయం ఆర్వో అనూరాధ అన్నారు.

అభ్యంతరాలు ఉంటే తెలపాలి
మాట్లాడుతున్న అనూరాధ

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనూరాధ

మంత్రాలయం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల ఆధునీకరణ, కొత్త కేంద్రాల గుర్తింపు, ఓటరు నమో దులో ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, మంత్రాలయం ఆర్వో అనూరాధ అన్నారు. శుక్రవారం మంత్రాలయం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ ఎస్‌.రవి అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల ఆధునీకరణ చేయడం, ఓటరు నమో దులో మార్పులు, చేర్పులు, అవసరమైన చోట కొత్త కేంద్రం ఏర్పాటుపై సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. రాజకీయ పార్టీలు, ఆయా మండలాల అధికారుల సూచనలు, సలహాలతోనే పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్డకడుబూరు, కౌతా ళం, కోసిగి తహసీల్దార్లు గీతా ప్రియదర్శిని, రజనీకాంత రెడ్డి, రుద్రగౌడు, ఎన్నికల డిటీలు జీకే గురురాజారావు, సీపీఎం జయరాజు, బీఎస్‌పీ సామేల్‌, సీపీఐ లక్ష్మణ్‌ నాయక్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 01:07 AM