రమణీయం.. స్వర్ణ పల్లకోత్సవం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:08 AM
రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.

మంత్రాలయం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మఠంలో శుక్రవారం పాల్గుణ సప్తమి శుభదినం సందర్భంగా పీఠాఽధిపతి సుబుధేం ద్రతీర్థులు మూల బృందావనానికి పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ చేశారు. బృందావనానికి బంగారు, వెండి,పట్టు వస్ర్తాలు, గులాబి పుష్పాలతో అలంకరించారు.