Share News

జిల్లాలో భానుడి భగభగ

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:43 PM

జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జిల్లాలో భానుడి భగభగ

రుద్రవరం మండలంలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత

నంద్యాల ఎడ్యుకేషన్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా రుద్రవరం మండలంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాలలో 42.9 డిగ్రీలు, సంజామల, గోస్పాడు, దొర్నిపాడు మండలాల్లో 42.5 డిగ్రీలు, నందికొట్కూరు 42.2, ఆళ్లగడ్డ 42.1, కొత్తపల్లె 42.0 డిగ్రీలు, ఉయ్యాలవాడ 41.6, డోన్‌ 41.6, కొలిమిగుండ్ల 41.3, మహానంది, బనగానపల్లె 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో కూడా 39.0 నుంచి 40.0 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైన మండలాల్లో వడగాలులు వీచాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:43 PM