Share News

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:50 AM

మండలంలోని వేల్పనూరు గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరెడ్డి తన స్వగృహంలో సీఎంఆర్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే బుడ్డా

వెలుగోడు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేల్పనూరు గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరెడ్డి తన స్వగృహంలో సీఎంఆర్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో 58 మంది సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా రూ.50 లక్షలు మంజూరయ్యాయి. అలాగే సీఎంఏజేవై పథకం కింద మరో ముగ్గురికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని అన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో అబ్దుల్లాపురం బాషా, నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:50 AM