పత్తికొండ జైలును సందర్శించిన జిల్లా న్యాయాధికారి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:05 AM
పత్తికొండ పట్టణంలో గురువారం కోర్టు, సబ్ జైలును జిల్లా న్యాయాధికారి కబర్ధి సందర్శించారు. గురువారం పత్తికొండకు వచ్చిన ఆయన నేరుగా జిల్లా కోర్టుకు వెళ్లారు.

పత్తికొండ టౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ పట్టణంలో గురువారం కోర్టు, సబ్ జైలును జిల్లా న్యాయాధికారి కబర్ధి సందర్శించారు. గురువారం పత్తికొండకు వచ్చిన ఆయన నేరుగా జిల్లా కోర్టుకు వెళ్లారు. న్యాయాధికారి మాట్లాడుతూ పత్తికొండలో సబ్‌కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, న్యాయవాదులు న్యాయాధికారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సబ్ జైలును సందర్శించి అక్కడ ఖైదీల వసతులపై ఆరా తీశారు. జిల్లా న్యాయాధికారి వెంట న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, డా.వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.