Share News

ఘనంగా ఉగాది సంబరాలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:44 AM

విశ్వావసు నామ ఉగాది సంబరాలను నగర ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు.

ఘనంగా ఉగాది సంబరాలు
హరిహర క్షేత్రంలో పూజలకు హాజరైన భక్తులు

కర్నూలు కల్చరల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ ఉగాది సంబరాలను నగర ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. హరిహర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన పూ జాది కార్యక్రమాలకు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత సతీ మణి టీజీ శిల్పాభరతలు హాజరై పుజలు నిర్వహించారు. అనంతరం కల్లే వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో వారు పాల్గొని, పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. వారికి ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సండేల్‌ చంద్రశేఖర్‌, చల్లా నాగరాజ శర్మ స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు అందజేశారు. నెహ్రూనగర్‌లోని పుట్టపర్తి సత్యసాయి బాబా మందిరంలో ఉగాది సందర్భంగా సత్యసాయి పారా యణ, రుద్ర పారాయణ, భజనలు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ పురోహితులు కేశవయ్య ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అలాగే పాతనగరం లోని జమ్మిచెట్టు సమీపంలోగల లలితా పీఠంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారా యణం చేశారు. సాయంత్రం మామిళ్లపల్లి రాజేశ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్ర మంలో లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్య స్వామి, పీఠం సేవకులు పాల్గొన్నారు. కొత్తబస్టాండు వెనుక ఉన్న కల్లూరు చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి దర్శనం కోసం ప్రజలు బారులు తీరారు. సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. సాయంత్రం బ్రహ్మశ్రీ కల్లే వేణుగోపాల శర్మ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సండేల్‌ చంద్రశేఖర్‌, చల్లా నాగరాజ శర్మ, కమిటీ గౌరవాధ్యక్షుడు సీవీ దుర్గాప్రసాద్‌, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్ర శర్మలు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పాతబ స్టాండు సమీపంలోని సుబేదారి వీధిలోని నాగ సుంకులా పరమేశ్వరి ఆలయంలో పూజారి కురువ శ్రీరాములు అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్ర మంలో మోహన, రవిప్రకాశ, ఆర్యన, యశస్విని, సాయిచరణ్‌, చైతన్య పాల్గొన్నారు. నగరంలో కిడ్స్‌ వరల్డ్‌ సమీపంలోని జిల్లా గో సంరక్షణ శాలలో ఆదివారం సాయంత్రం ఈశ్వర శశిధర కుమార్‌శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. బుధవారపేటలోని సుంకులమ్మ, నెహ్రూరోడ్డు లోని మారెమ్మ, సప్తగిరినగర్‌లోని సుంకులమ్మ, చిత్తారివీధి లోని నిమిషాంబాదేవి ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు నిర్వహిం చారు. ఆయా దేవాలయాల్లో సాయంత్రం జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్ర మానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

టీటీడీ- హిందూ ధర్మ ప్రచార పరిషత ఆధ్వర్యంలో.. విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుక సందర్భంగా ఆదివారం సాయంత్రం పాతన గరంలోని పేట శ్రీరామాలయంలో టీటీడీ- హిందూధర్మ ప్రచార పరిషత ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాళిగి హనుమే షాచ్యులు ద్వాదశ రాశుల వారి సంవత్సర ఫలితాలు వివరించారు. వివిధ రాశి ఫలాలు, రాష్ట్ర, దేశ కాలమాన పరిస్థితులు, వ్యవసాయం, వర్షాలు తదితర అంశాలను ఆయన వీనులవిందుగా పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచా ర పరిషత ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహకుడు డాక్టర్‌ మల్లు వెంకటరెడ్డి, ఆలయ శతాబ్ది ఉత్సవ సమితి సభ్యులు మాళిగి వ్యాసరాజు, సతీష్‌, సుధీంద్ర, చిల్కూరి ప్రభాకర్‌, విఠల్‌శెట్టి, నందకిషోర్‌ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, మీదివేముల, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, గుట్ట పాడు, ఎన.కొం తలపాడు, శకునాల, హుశేనాపురం, పాలకొలను, సోమ యాజులపల్లె, తదితర గ్రామాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకు న్నారు. గ్రామాల్లో వెలసిన ఆలయాలకు వెళ్లి స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఓర్వకల్లులోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు విష్ణుశర్మ, అర్చకులు నారాయ ణశర్మ పంచాంగ పఠనం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు ఎద్దులకు కాడి గట్టి తమ పొలాలను దుక్కిదున్నారు. ఓర్వకల్లు చెన్నకేశవస్వామి ఆలయంలో నిర్వహించిన పంచాంగ పఠ నంలో నాయకులు గోవిందరెడ్డి, శంకర్‌ రెడ్డి, రంగనాథగౌడు, కురువ పె ద్దయ్య, అల్లాబాబు, అబ్దుల్లా, నాగరాజు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన: విశ్వావసు నామ ఉగాది సంవత్సరం సందర్భంగా ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహిం చిన నగర సాంఘిక్‌లో ఆంధ్రప్రదేశ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) కర్నూలు తరపున ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బి.చిన్ననాగ స్వామి నాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.వెం కటేశ్వర్లు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు జేవీఆర్‌ శెట్టి, ఓర్వకల్లు మండల అధ్యక్షుడు కె.రామకృష్ణుడు పాల్గొన్నారు.

ఫ సలాంఖాన ఎస్టీయూ భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గోకారి అధ్యక్షతన తెలుగు సంవత్సరాది ఉగాది సందర్బంగా పం చాంగ పఠనం నిర్వహించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు హీరాలాల్‌ పురోహితుడిగా వ్యవహరించి పంచాంగ పఠనం గావించారు. విశ్వావసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్దిగా కురిసి, పాడి పంటలు బాగా పండుతాయని, పత్తికి మంచి ధర ఉంటుందని, రాశీ ఫలాలు చదివి వినిపించారు. కార్యక్రమంలో టీకే జనార్దన, నాగయ్య, గుప్తా శ్రీధర్‌ఖ, సురేష్‌, హుశేనమియా, ఏళ్ల నాగరాజు, ముర్తుజావలి, బాలకృష్ణ, గోవిందు, గోవిందు నాయక్‌, శాంతమూర్తి, దేవరాజు, నాగరాజు, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.

గూడూరు: విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కె.నాగలాపురం సుంకులాపరమేశ్వరి అమ్మ వారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అలాగే గూడూరు పట్టణంలోని స్వయంభూ ఆంజనేయస్వామి సుంకులమ్మ, కాళికామాత, నీలకంఠేశ్వరస్వామి ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామి ఆలయం దగ్గర పురోహి తుడు ఆమంచి విశ్వేశ్వర శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. ఆలయా లను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.

Updated Date - Mar 31 , 2025 | 12:44 AM