Share News

తాగునీటికి సమస్య లేదు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:48 AM

ఈ వేసవిలో ఎండల మండిపోతున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టులో ప్రస్తుతం 1.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

తాగునీటికి సమస్య లేదు
జీడీపీలో నిల్వ ఉన్న నీరు

జీడీపీలో 1.4 టీఎంసీల నీరు

ఏప్రిల్‌ 10 వరకు ఆయకట్టు భూములకు సాగునీరు

గోనెగండ్ల, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో ఎండల మండిపోతున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టులో ప్రస్తుతం 1.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ వేసవిలో ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి సమస్య లేదని జీడీపీ ఇరిగేషన అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం జీడీపీలో నీటి మట్టం 2.1(గ్రాస్‌), (1.4లైవ్‌)టీఎంసీల నీరు ఉన్నట్లు తెలుస్తుంది. ఎండలు పెరిగే కొద్ది ప్రాజెక్టు నీరు అవిరి రూపంలో రోజుకు 30 నుంచి 35 క్యూసెక్కుల నీరు అవిరి అవుతున్నట్లు తెలుస్తుంది. జీడీపీ ఆయకట్టు కిందా 13వేల ఎకరాలు సాగు చేశారు. పంటలు పూర్తి గా చేతికి అందాలంటే మరో పది రోజులు నీరు ఇవ్వాలని రైతులు అధికారులను కోరగా ఇందుకు సానుకూలంగా స్పందించి ఏప్రిల్‌ 10 వ తేదీ వరకు జీడీపీ కింద ఉన్న ఆయకట్టు భూములకు సాగు నీరు విడుదల చేయనున్నట్లు ఇరిగేషన అధికారులు తెలుపుతున్నారు. ఏప్రీల్‌, మే నెలలలో ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జూన, జూలై నెల వరకు తాగునీటి పథకాలకు ఇబ్బంది ఉంటుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేము. గాజులదిన్నె ప్రాజెక్టు కింద బండగట్టు, డోన, క్రిష్టగిరి నీటి పథకాల కింద దాదాపు 120 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే అవసర సమయంలో కర్నూలు, కోడుమూరు, గూడురు, బెళగల్‌, నగరాలకు తాగునీటి కోసం అధిక నీటిని తరలిస్తే కొంత ఇబ్బందిగా మారచ్చని తెలుస్తోంది.

Updated Date - Mar 31 , 2025 | 12:48 AM