మూడు రోజులకోసారి తాగునీరు
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:20 PM
మండలంలో గ్రామాల్లో మూడు రోజుకోసారి తాగునీరు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిడిరాయి కొత్తూరులో దాదాపు 2,500 మంది ఉంటున్నారు. పగిడిరాయి కొత్తూరు గ్రామ ప్రజల దాహార్తి తీర్చడానికి గ్రామంలో బోర్లు వేసినా సక్రమంగా నీరు అందడం లేదు.

తుగ్గలి మండలంలో ప్రజల అవస్థలు
నీరు కావాలంటే పొలం పనులు మానుకోవాల్సిందేనని ఆవేదన
తుగ్గలి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):మండలంలో గ్రామాల్లో మూడు రోజుకోసారి తాగునీరు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిడిరాయి కొత్తూరులో దాదాపు 2,500 మంది ఉంటున్నారు. పగిడిరాయి కొత్తూరు గ్రామ ప్రజల దాహార్తి తీర్చడానికి గ్రామంలో బోర్లు వేసినా సక్రమంగా నీరు అందడం లేదు. దీంతో సమీపంలోని బొండ్లవానిపల్లె గ్రామం వద్ద బోరు వేసి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పైపులైన్లు వేశారు. కాగా ఇక్కడ కూడా భూగర్బజలాలు ఇంకిపోవడంతో మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. రేయింబవళ్లు బిందెలతో పడిగాపులు కాయాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. గత్యంతరం లేక వ్యవసాయ బోర్లకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.
పడిగాపులు కాయాల్సిందే
తాగునీటి కోసం కొళాయిలవద్ద రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. పనులకు వెళ్లడా నికి వీలు కావడం లేదు. ఇక్కడ నీరు రాకపోతే ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నాం. - ఆనంద్, పగిడిరాయి కొత్తూరు గ్రామం