Share News

ఆ ఐదుగురే..!

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:51 PM

నగరంలోని శరీన్‌నగర్‌లో సంచలనం సృష్టించిన కాశపోగు సంజన్న హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీలు బాబు ప్రసాద్‌, శ్రీనివాసాచారి, సీఐలు మధుసూదన్‌గౌడు, శేషయ్యలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఆ ఐదుగురే..!
నిందితుల అరెస్టు చూపిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

సంజన్న హత్య కేసులో నిందితుల అరెస్టు

ఆధిపత్య పోరు.. పాత కక్షలే కారణం

కర్నూలు క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నగరంలోని శరీన్‌నగర్‌లో సంచలనం సృష్టించిన కాశపోగు సంజన్న హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీలు బాబు ప్రసాద్‌, శ్రీనివాసాచారి, సీఐలు మధుసూదన్‌గౌడు, శేషయ్యలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితులు వడ్డె ఆంజనేయులు, ఆయన కుమారులు వడ్డె శివ, వడ్డె తులసి, వడ్డె రేవంత్‌, వీరి అనుచరుడు వడ్డె అశోక్‌లను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన నాలుగు వేటకొడవళ్లు, ఒక పిడి బాకు, ఆరు సెల్‌ ఫోన్లు, రెండు కట్టెలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ తెలిపిన మేరకు.. మృతుడు సంజన్న, కుటుంబ సభ్యులు, నిందితుడు ఆంజనే యులు కుటుంబ సభ్యుల మధ్య కొద్ది కాలంగా గొడవలు ఉన్నాయి. ఆధిపత్య కోసం ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. 2022లో కూడా వీరిద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకు న్నారు. ఈ నెల 14న ఉదయం ఇమ్రాన్‌ అనే వ్యక్తి వడ్డె ఆంజనేయులుతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆంజనే యులు చొక్కా కాలర్‌ పట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆంజనేయులు అందరూ తనను చులకనగా చూశారని, తాను అంటే భయం పోయిందని, సంజన్నను చూసే ఇదంతా చేస్తున్నారని కొడుకులతో వాపోయాడు. ఎలాగైనా సంజన్నను హతమార్చాలని ప్రణాళిక చేసుకు న్నారు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కాశపోగు సంజన్న శరీన్‌నగర్‌లో ఉన్న మెడిటేషన్‌ సెంటర్‌కు రావడంతో అప్పటికే కాపు కాసిన వీరంతా సంజన్నపై దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. ఆంజనేయులు భార్య, అల్లుడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచామని, ప్రతి ఆదివారం ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లను కౌన్సెలింగ్‌ ఇస్తామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీలు, సీఐలు శేషయ్య, మధుసూదన్‌గౌడు, చంద్రబాబు నాయుడు, శ్రీధర్‌, తబ్రేజ్‌, వేణుగోపాల్‌లను ఎస్పీ అభినందించారు.

Updated Date - Mar 21 , 2025 | 11:51 PM