Share News

AP SSC exams: టెన్త్‌ సంస్కృతం పేపర్లు తారుమారు!

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:22 AM

శనివారం నిర్వహించిన సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను, మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్‌ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్‌ ఇచ్చారు.

AP SSC exams: టెన్త్‌ సంస్కృతం పేపర్లు తారుమారు!

ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యంతో ఆరుగురు విద్యార్థులకు తిప్పలు

ఇబ్రహీంపట్నం/రణస్థలం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యంతో ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు తారుమారవడం కలకలం రేపిం ది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్‌బాస్కో స్కూల్‌ కేంద్రంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. శనివారం నిర్వహించిన సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను, మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్‌ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని విద్యార్థిని కరణం తేజస్వి గుర్తించింది. దీనిపై మరో విద్యార్థిని అడిగి నిర్ధారించుకుంటున్న సమయంలో మాట్లాడితే బయటకు పంపేస్తానని ఇన్విజిలేటర్‌ వారించడంతో మౌనంగా ఉండిపోయింది. పరీక్ష పూర్తయి బయటకు వచ్చిన తర్వాత తోటి విద్యార్థుల ప్రశ్నాపత్రంతో పోల్చి చూసుకొని ఈ ఆరుగురూ కంగుతిన్నారు. దీనిపై వారి తల్లిదండ్రులు కొద్దిసేపు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కాగా, ఇన్విజిలేటర్‌ పొరపాటు కారణంగా సంబంధం లేని పేపర్‌తో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ప్రశ్నాపత్రం మార్పు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌ ఎస్‌. శైలజను సస్పెండ్‌ చేయడంతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్‌ కేజేఎన్‌ లక్ష్మి, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ జె. విద్యాసాగర్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వివరించారు.


కుప్పిలిలో ఆరుగురిపై కేసు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్‌ స్కూలు పరీక్ష కేంద్రంలో టెన్త్‌ పరీక్షల కాపీయింగ్‌ వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదైంది. శుక్రవారం ఇంగ్లిష్‌ పరీక్ష జరుగుతుండగా డీఈవో ఎస్‌.తిరుమల చైతన్య ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీ నిర్వహించి 15మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు వేశాయి. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎచ్చెర్ల ఎస్‌ఐ వి. సందీప్‌ కుమార్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 04:22 AM