Hyderabad: ఇండియా బాగుంటేనే అమెరికా బాగుంటుంది
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:26 AM
ఇండియా బాగుంటేనే అమెరికా బాగుంటుందని, అదే రీతిలో అమెరికా బాగుంటేనే ఇండియా కూడా బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారు మార్క్ బర్న్స్ చెప్పారు.

పరస్పర ప్రయోజనకరంగానే సుంకాలు
భారతీయ ప్రతిభను మేం వదులుకోం
భారత కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి
ట్రంప్ సలహాదారు బర్న్స్ వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో యుఎస్ జీసీఐ ఇండియా చాప్టర్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఇండియా బాగుంటేనే అమెరికా బాగుంటుందని, అదే రీతిలో అమెరికా బాగుంటేనే ఇండియా కూడా బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారు మార్క్ బర్న్స్ చెప్పారు. పరస్పర సహకారంతోనే 2దేశాలూ మహోన్నతంగా ఎదుగుతాయన్నారు. యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యుఎస్ జీసీఐ) హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్‌బిజినెస్ సమ్మిట్ 2025లో ఆయన పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో యుఎస్ జీసీఐ ఇండియా చాప్టర్‌ను బర్న్స్ ప్రారంభించారు. ఇండియా సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో 54% అమెరికాకే వస్తున్నాయన్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇంధన రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. స్టార్‌లింక్ లాంటి సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. జెఎ్‌సడబ్ల్యు స్టీల్‌లాంటి సంస్థలు యుఎ్‌సలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇటీవలే 3 భారతీయ కంపెనీలు యుఎ్‌సలో పెట్టుబడులు పెట్టి 3 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయని బర్న్స్ తెలిపారు. మరిన్ని భారత కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సుంకాల సమస్య పరిష్కారానికి ఇండియా చురుకైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెబుతూ ఈ సంవత్సరం పరస్పర అంగీకారయోగ్యమైన ఒప్పందం జరుగనుందన్నారు. అమెరికాకున్న నిపుణుల కొరతను భారతీయ విద్యార్థులు తీరుస్తున్నారని, భారతీయ ప్రతిభను అమెరికా వదులుకోబోదన్నారు.
యుఎ్‌సలో వాడుతున్న జెనరిక్ ఔషదాలలో 47% భారత్‌వే
అపోలో మెడ్‌స్కిల్స్ సీఈఓ డాక్టర్ శ్రీనివాస్ రావు పులిజల మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ రంగం ఇప్పుడు మూడు బీల కారణంగా మారుతుందన్నారు. అవి బయాలజీ, బైట్స్, బ్యాండ్ విడ్త్ అని చెప్పిన ఆయన యుఎ్‌సలో డాక్టర్లు చేస్తోన్న ప్రతి పది ప్రిస్ర్కిప్షన్‌లలో కనీసం 4 భారతీయ ఔషదాలే ఉంటున్నాయన్నారు. అలాగే యుఎ్‌సలో వాడుతున్న జెనరిక్ ఔషదాలలో 47ు భారతీయ ఫార్మా సంస్థలు రూపొందించినవే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏంజెల్‌ఇన్వెస్టర్ జె ఏ చౌదరి, యుఎస్ జీసీఐ ఇండియా వ్యవస్ధాపకులు డాక్టర్ సోలోమన్ గట్టు తదితరులు పాల్గొన్నారు.