వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:22 AM
మండలంలోని జి.లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్‌రెడ్డిని (53) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు.

బండిఆత్మకూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని జి.లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్‌రెడ్డిని (53) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. సుధాకర్‌రెడ్డి, భార్య విమలమ్మ పొలానికి వెళ్లి బైకుపై తిరిగి ఇంటికి వస్తుండగా జీసీ పాలెం బొగ్గు కాలువ అలుగు వంక సమీపంలో రామస్వామి, అతడి కుమారులు తిరుపాల్, శివ మాటు కాసి వేట కొడవళ్ళతో నరికి చంపారు. పదేళ్లుగా వీరి మధ్య ఆరు సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. కేసులు సైతం నడిచాయి. సుధాకర్‌రెడ్డి కోర్టు ద్వారా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రామస్వామి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మళ్లీ సర్వేయర్లతో కొలతలు వేయించి సదరు స్థలానికి హద్దులు ఏర్పరచి సుధాకర్‌రెడ్డికి స్వాధీనం చేశారు. ఇదంతా మింగుడు పడని రామస్వామి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం హత్య చేశాడు. పక్క పొలాల్లో ఉన్న శ్రీనివాసరెడ్డి, మహేశ్వరరెడ్డి అడ్డుకోబోగా వారిని కూడా చంపుతామని బెదిరించారు. సుధాకర్‌రెడ్డిని నరికి చంపి, కత్తులు పక్కనే కాలువలో పడేసి పారిపోయారు. సధాకర్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ జావళి, రూరల్ సీఐ శ్రీనివసరెడ్డి పరిశీలించారు.