Share News

క్షయను నిర్మూలిద్దాం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:37 AM

క్షయను నిర్మూలిద్దామని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నట్లు ఐఎంఏ సభ్యులు డా.గోపినాథ్‌, డా.శ్రీనివాస్‌ అన్నారు.

క్షయను నిర్మూలిద్దాం
ఆదోనిలో ర్యాలీ

ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో ర్యాలీ

నిర్వహించిన వైద్యాధికారులు

ఆదోని టౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయను నిర్మూలిద్దామని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నట్లు ఐఎంఏ సభ్యులు డా.గోపినాథ్‌, డా.శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆదోనిలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదిత్య నర్సింగ్‌ హోమ్‌లో క్షయపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీబీ కేవలం దగ్గు రావడం, దగ్గితే రక్తం పడటం మాత్రమే కాదని, శరీరంలోని ఏ భాగానికైనా సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రారంభంలోనే గుర్తించి తగిన పరీక్షలు చేయంచి, మందులు వాడితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఐఎంఏ అధ్యక్షుడు డా.కృష్ణమూర్తి, డా.ఆదిత్య కుమార్‌, డా వసుధ రాణి పాల్గొన్నారు.

ఏరియా ఆస్పత్రిలో

డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.సత్యవతి, డా.శేఖన్‌ భాను అవగాహన కల్పించారు. డా.వందన్‌, డా.మనీషా, సిబ్బంది స్వరూప్‌, భాస్కర్‌, లలితమ్మ, సుబ్బమ్మ బాయి, వీరేష్‌, ఆశావర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీబీ బాధితులకు పౌష్ఠికాహార కిట్లను దాతలు ఉపాధ్యాయులు నిరంజన్‌ కుమార్‌, ఫయాజుద్దీన్‌ ఆధ్వర్యంలో అందజేశారు.

సేవలకు గుర్తింపుగా అవార్డు

పట్టణంలోని ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్‌లో ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు అవార్డులు లభించాయి. సూపర్వైజర్‌ బాబురాజు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పద్మావతి కర్నూలులో టీబీ జిల్లా అఽధికారి డా. భాస్కర్‌ నుంచి అందుకొన్నారు.

క్షయ లేని గ్రామాలే లక్ష్యం

ఆదోని రూరల్‌: క్షయ లేని గ్రామాలే లక్ష్యంగా ముందుకె ళుతున్నట్లు డీఎంహెచ్‌వో సత్యవతి, వైద్యాధికారులు తెలిపారు. కర్నూలులో క్షయ రహిత గ్రామాల సర్పంచులు కోట పరమేష్‌ (నాగలా పురం), రోహిత ప్రియా (ఆరేకల్లు), మహారేఖ (బలదూరు) సన్మానించారు.

క్షయపై అప్రమత్తంగా ఉండాలి

మద్దికెర: క్షయపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారులు రాగిణి, శ్రీలక్ష్మి తెలిపారు. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు.

టీబీ రహిత పంచాయతీగా బొంతిరాళ్ల

క్రిష్ణగిరి: టీబీ రహిత గ్రామ పంచాయతీగా నిలిచిన బోయ బొంతిరాళ్ళ గ్రామ సర్పంచ్‌ రవిమోహన్‌కు వైద్యాధికారులు కర్నూలులో అవార్డు అందించారు. జిల్లా లీగల్‌ అథారిటి చైర్మన్‌ లీలా వెంకట శేషాద్రి, డీఎంహెచ్‌వో, డీపీవో భాస్కర్‌, జిల్లా క్షయ నివారణ అధికారి మోక్షేశ్వరుడు మీదుగా అందుకున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:37 AM