Share News

సాంఘిక సంక్షేమ అధికారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:42 AM

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ కోరారు.

సాంఘిక సంక్షేమ అధికారిపై చర్యలు తీసుకోవాలి
జేసీకి వినతిపత్రం ఇస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్‌ కలెక్టర్‌ నవ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో ఆరో తరగతి విద్యార్థిని అక్కడ సీనియర్‌గా ఉన్న విద్యార్థిని బెల్టుతో చితక బాదుతూ గాయాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పత్తికొండ మండల కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ సంక్షేమ వసతి గృహంలో 9వ తరగతి చదువున్న విద్యార్థి వంటిపై సాంబర్‌ పడి శరీర సగభాగం కాలిపోయిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కనీసం పరామర్శించడం లేదన్నారు.

కారుణ్య నియామకంపై విచారణ చేపట్టాలి: నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఎస్‌.నారాయణ కారుణ్య నియామకంపై విచారణ చేపట్టాలని జాతీయ లంబాడి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యోగేష్‌ నాయక్‌ జాయింట్‌ కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ తండ్రి మద్దిలేటి నకిలీ షెడ్యూ ల్‌ తెగలకు చెందిన సర్టిఫికెట్‌తో గుంతకల్లులో డిజిల్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారన్నారు. కానీ బీసీ వర్గానికి చెందిన మద్దిలేటి తండ్రి కర్నూలు గవర్నమెంటు హాస్పిటల్‌ పని చేస్తూ చనిపోయారన్నారు. నారాయణ తన తండ్రి మద్దిలేటి కాకుండా వారి తాత పేరుతో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్‌ను సృష్టించి కారుణ్య నియామకం పొందారన్నారు. తండ్రి ఎస్టీ, కొడుకు బీసీ మీద ఉద్యోగం పొందారన్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన రెవెన్యూ ఉద్యోగులతోపాటు నారాయణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫ దేవనకొండ మండలం వెలుగు సీసీ తనూజ ఏటీఎం నరసన్న వందనపై చర్యలపై తీసుకోవాలని పొదుపు ప్రగతి సంఘం సభ్యురాలు అనూరాధ, ఐక్యసంఘం సభ్యురాలు నాగలక్ష్మిలు జాయింట్‌ కలెక్టర్‌కు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదుపు సంఘం నుంచి రూ. 2 లక్షలు తీసుకుని మమ్మల్ని మోసం చేశారన్నారు. పొదుపు సం ఘం డబ్బులు ఇప్పించాలని కోరారు.

Updated Date - Mar 25 , 2025 | 12:42 AM