ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:39 AM
నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా నాయకుడు అంజిబాబు డిమాండ్ చేశారు.

తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయింపు
మంత్రాలయం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా నాయకుడు అంజిబాబు డిమాండ్ చేశారు. సోమవారం మం త్రాలయంలో అంబేడ్కర్ సర్కిల్ నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఊసే లేదన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇవ్వా లని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జయరాజు, పెద్దకడుబూరు మండల కార్యదర్శి తిక్కన్న, సీపీఎం నాయకులు లక్ష్మన్న, అనిల్, ప్రాణేష్, అంజి, తిమ్మోతి, అంజనేయ, సురేష్, మారెప్ప, వీరేష్ పాల్గొన్నారు.