Share News

న్యాయసుధలో ఎనిమిది మంది ఉత్తీర్ణులు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:41 AM

రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీ ఠంలో శ్రీమన న్యాయసుధ విద్యలో సోమవారం ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి శ్రీమఠానికి గుర్తింపు తెచ్చారు.

న్యాయసుధలో ఎనిమిది మంది ఉత్తీర్ణులు
పీఠాధిపతితో పట్టా అందుకున్న విద్యార్థులు

పట్టాలు అందజేసిన పీఠాధిపతి

మంత్రాలయం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీ ఠంలో శ్రీమన న్యాయసుధ విద్యలో సోమవారం ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి శ్రీమఠానికి గుర్తింపు తెచ్చారు. 12 ఏళ్లుగా కావ్య, నాటక, వ్యాకరణ, తర్క, న్యాయ, మీమాంస శాస్ర్తాలు చదివి రెండేళ్లుగా పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు, పండిత కేసరి విధ్వాన రాజాఎస్‌ గిరిరాజాచార్‌ దగ్గర శ్రీమన న్యాయసుధ విద్యను అభ్యసిం చారు. దాదాపు 20 మందిగా పీఠాధిపతులు, 300 మంది ప్రసిద్ధి పండి తులు ఆధ్వర్యంలో మౌఖిక పరీక్షల్లో తమ పాండిత్యాన్ని నిరూపించారు. హ్రిషికేష్‌, పురిణిక్‌ బద్రినాథ్‌, అభిషేక్‌జోషి, శ్రీకరతంత్రి, పీఎస్‌ రాఘ వేంద్ర, వదిసింహ, పావనాచార్య, ఫణిరాజ్‌ పురోహిత పండితులుగా గుర్తింపు పొందారు. వీరికి రాఘవేంద్రస్వామి మఠంలో శాశ్వత ఉద్యోగం, రూ. లక్ష నగదు, మెమెంటో, ప్రశంసపత్రం, శేషవస్త్రం అందజేశారు. స్థాని క పీఠాధిపతిని మంగళ మహోత్సవంలో పాల్గొన్న పీఠాధిపతులు అభి నందించారు. న్యాయసుధ విద్యార్థులు పీఠాధిపతి, రాజాఎస్‌ గిరిరా జచార్‌లను ఘనంగా సత్కరించారు.

Updated Date - Mar 25 , 2025 | 12:41 AM