గౌరు సమక్షంలో టీడీపీలో చేరిక
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:43 AM
30వ వార్డు శరీననగర్‌కు చెందిన పది వైసీపీ కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు.

కల్లూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): 30వ వార్డు శరీననగర్‌కు చెందిన పది వైసీపీ కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. సోమవారం మాధవీ నగర్‌లోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు సభ్యులు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సుమన, క్రిష్టఫర్, అబ్రహం, బుజ్జి, కిరణ్, శేషు, రాజు, రమేష్, వంశీ ఉన్నారు. కార్యక్రమంలో కల్లూరు అర్బన వార్డుల అఽధ్యక్షుడు పెరుగు పురుషోత్తంరెడ్డి, వీరేంద్రకుమార్, సందీప్ పాల్గొన్నారు.