ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:38 AM
ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో సబ్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.

సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో సబ్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని
1. పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ కట్టినా ఇంకా ఇవ్వలేదని మంజూరు చేయించాలని ఆదోని మండలం నెట్టకల్ గ్రామానికి చెందిన హరిసింగ్ అర్జీ ఇచ్చారు.
2. ఆదోని మండలంలో తాగునీరు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు, తదితర సమస్యలను పరిష్కరించాలని సీపీఐ (మార్కిస్ట్) మండల కార్యదర్శి లింగన్న అర్జీ సమర్పించారు.
3. తాను సర్వే.నెం. 124సిలో నివాసముంటున్నానని, పట్టా మంజూరు చేయాలని ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామానికి చెందిన మునిస్వామి అర్జీ సమర్పించారు.
4. తనకు సర్వే నెం.250 బిలో 4.10 ఎకరాల భూమి ఉండగా ఆన్‌లైన్‌లో వేరే వారి పేరు నమోదైందని, విచారించి తన పేరు నమోదు చేయాలని కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన శ్రీ పాదారావు అర్జీ సమర్పించుకున్నారు.
డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్స్ శ్రీనివాస రాజు, వేణు సూర్య, డీఎల్పీవో నూర్జహాన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్, రఫీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ షఫీఉల్లా, డీటీ గుండాల నాయక్, పాల్గొన్నారు.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలి
ఆదోని టౌన్: కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కు మార్ పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని ముస్లిం నాయకులు ఖలీపా ఖలీద్, ఖాజీ తాహెర్ జామియా మసీద్ ఖదీప్, జునైద్, నూర్ అహ్మద్ కోరారు. సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మైనార్టీలు వ్యతిరేకిస్తున్న బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడం అన్యాయమన్నారు. సద్దాం హుస్సేన్, ఫయాజ్ భాష, అబూబాకర్ సిద్ధికి, నాసిర్ అహ్మద్, ఫారుక్ పాల్గొన్నారు.