Share News

పుచ్చకాయతో ఉపశమనం

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:30 PM

అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాలయను ఆశ్రయిస్తు న్నారు. ఆలూరు పట్టణంలో వ్యాపారులు పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనగోలు చేసి, ఆలూరుకు తెచ్చి, కాయ పరిమాణాన్ని బట్టి రూ.30ల నుంచి విక్రయిస్తున్నారు.

పుచ్చకాయతో ఉపశమనం
ఆలూరులో పుచ్ఛకాయలను విక్రయిస్తున్న వ్యాపారి

వేసవిలో మంచిదంటున్న వైద్యులు

ఆలూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాలయను ఆశ్రయిస్తు న్నారు. ఆలూరు పట్టణంలో వ్యాపారులు పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనగోలు చేసి, ఆలూరుకు తెచ్చి, కాయ పరిమాణాన్ని బట్టి రూ.30ల నుంచి విక్రయిస్తున్నారు.

పుచ్చకాయలతో ప్రయోజనాలు

పుచ్చకాయలను మధుమేహ బాధితులు కూడా తినవచ్చని వైద్యులు సచిస్తున్నారు. నీరు అధికంగా ఉండటంతో తొందరగా అరుగుతుందని, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయం టున్నారు. శరీరాన్ని హైడ్రేట్‌ చేయడంలో సహాయప డుతుంది, గుండే జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం, రక్తపోటును నియం త్రించడంలో సహాయ పడుతుంది. ఇందులో ఉండే లైకోపీన్‌, యాం టీ ఆక్సిడెంట్‌, క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోదిస్తుంది. ఫైబర్‌ అధికంగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగు పరిచి, బరువు తగ్గిస్తుంది. విటమిన్‌-ఏ, సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వేసవిలో మేలు

పుచ్చకాయలతో వేసవిలో ఆరోగ్యానికి మేలు. ఇందులో ఎలక్ర్టోలైట్లు, కండరాల నొప్పులను తగ్గి స్తుంది. శరీరానికి తగి నంత శక్తిని ఇస్తుంది. వీటిలో ఉండే సహజ మైన చక్కెర, శరీరానికి శక్తిని అందిస్తుంది.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్‌ ఏ,సి ఉండటంతో కంటి చూపు మెరుగుపరుస్తుంది. -డా.వహీద్‌, ప్రభుత్వ వైద్యుడు, ఆలూరు.

Updated Date - Mar 30 , 2025 | 11:30 PM