Share News

రోడ్ల నిర్మాణం పూర్తి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:16 PM

ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణ పనులను వందశాతం పూర్తి చేశామని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

రోడ్ల నిర్మాణం పూర్తి: కలెక్టర్‌
ఫిర్యాదుదారుడి సమస్యను వింటున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణ పనులను వందశాతం పూర్తి చేశామని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ రోడ్లకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సీసీరోడ్లను 96శాతం పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. పంట నీటికుంటలు, పర్క్యులేషన్‌ ట్యాంక్స్‌, ఫిష్‌ట్యాంక్స్‌ తదితరవాటిని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నుంచి 203దరఖాస్తులను కలెక్టర్‌, జేసీ విష్ణుచరణ్‌, ఇతర అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంతోపాటు ఫిర్యాదుదారులనుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 30వేల అర్జీలు పరిష్కరించామని వారి నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.

Updated Date - Mar 24 , 2025 | 11:16 PM