Share News

కొలిక్కిరాని ఎంపిక

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:37 PM

కార్పొరేషన్ల రాయితీ రుణాలు అందజేసేం దుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపు 690 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలోనే అధికారులు, బ్యాంకర్లు ఇంట ర్వ్యూలను కూడా పూర్తి చేశారు. అయితే జాబితా విడుదల కాకపోవడంతో దరఖాస్తుదా రులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కొలిక్కిరాని ఎంపిక
ఇంటర్వ్యూ చేస్తున ఎంపీడీవో, బ్యాంకర్లు (పైల్‌)

సబ్సిడీ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు

ఆలూరు మండలానికి 70 యూనిట్లకు 680 దరఖాస్తులు

ఆలూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్ల రాయితీ రుణాలు అందజేసేం దుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపు 690 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలోనే అధికారులు, బ్యాంకర్లు ఇంట ర్వ్యూలను కూడా పూర్తి చేశారు. అయితే జాబితా విడుదల కాకపోవడంతో దరఖాస్తుదా రులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఆలూరు మండలానికి 70 యూనిట్లు

రుణాలు ఇచ్చేందుకు పట్టణంలోని ఏపీ జీబీ, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్బీఐతో పాటు మొలగవళ్లి ఎస్బీఐ, ఆస్పరి ఏపీజీబీలను కేటాయించారు. ఆలూరు స్టేట్‌ బ్యాంక్‌ పరిధిలో 15, యూనియన్‌ బ్యాంక్‌ 15, ఎపీజీబీ 11, మొలగవల్లి 15, పెద్ద హొతూరు 9 యూనిట్ల చొప్పున మొత్తం 70 యూనిట్లు మంజూరయ్యాయి. అయితే అధికారులు లబ్దిదారుల తుది జాబితాను విడుదల చేయలేదు.

ఎంపికలో నాయకుల తలమునకలు

రుణాల మంజూరుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎవరిని ఎంపిక చేయాలో అధికార పార్టీ నాయకులు తలమునకలయ్యారు. దీనికితోడు కూటమిలో మూడు పార్టీలు ఉండ టంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమదే నిర్ణయమని చెప్పుకుం టున్నారు. 50 శాతం రాయితీ వస్తుండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

సకాలంలో పూర్తి చేస్తాం

రాయితీ రుణాలకు అభ్యర్థుల ఎంపికను సకాలంలో పూర్తిచేస్తాం. ప్రతి యూనిట్‌కు ఇద్దరిని ఎంపిక చేసి బ్యాంకులకు అందజేస్తాం. బ్యాంకర్ల అనుమతి వచ్చిన వెంటనే లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తాం. - మహబూబ్‌ బాషా, ఎంపీడీవో, ఆలూరు

Updated Date - Mar 21 , 2025 | 11:37 PM