Share News

గాంధీనగర్‌లో చైన్‌ స్నాచింగ్‌..

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:00 AM

: పట్టణంలోని గాంధీనగర్‌లో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కలకలంరేపింది. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగుడి కథ విషాదంగా ముగిసింది.

గాంధీనగర్‌లో చైన్‌ స్నాచింగ్‌..
దొంగతనం జరిగిన ప్రాంతం, ఇన్‌సెట్‌లో బాధితురాలు

ద్ధురాలి మెడలో బలవంతంగా బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగుడు

పారిపోతూ కిందపడిన దుండగుడు ఫ చికిత్స పొందుతూ మృతి

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గాంధీనగర్‌లో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కలకలంరేపింది. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగుడి కథ విషాదంగా ముగిసింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి బస్టాండ్‌ ప్రాంతంలో బార్‌బార్‌ షాపులో పనిచేస్తున్నాడు. గాంధీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మొదటి అంతస్తులో తనకు పరిచయం ఉన్న వృద్ధదంపతులు ఇంటిలోకి తెల్లవారుజామునే వెళ్లాడు. వృద్ధురాలు రమణమ్మ తెల్లవారు జామున బాత్‌రూంలో నుంచి బయటకు వస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొన్ని ఒక్కసారిగా ఆమెను బలంగా నెట్టివేశాడు. ఈ క్రమంలో బాధితురాలు రమణమ్మకు ముఖంపైన, చేతులు, కాలికి స్పల్పగాయాలయ్యాయి. దీంతో బాధిత వృద్దురాలు కిందపడి గట్టిగా కేకలు వేసింది. బంగారు గొలుసును లాక్కొన్ని పారిపోయే క్రమంలో దుండగుడు రాఘవేంద్ర పై అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. బాధితురాలి బంధువులు, పోలీసు లకు సమాచారం అందిండంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే దుండగుడు రాఘవేంద్ర బంధు వులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాల పాలైన రాఘవేంద్రను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని తిరిగి ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:00 AM