Share News

మత్య్సకారులకు అవగాహన

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:01 AM

అలివి వలలు వినియోగించి చేపలు పడితే మత్స్యకారుల లైసెన్స్‌లను రద్దు చేసి చర్యలు తీసుకుంటామని నంద్యాల షిషరీష్‌ జేడీ ఏవీ రాఘవరెడ్డి, నందికొట్కూరు తహసీల్దార్‌ శ్రీనివాసులు హెచ్చరించారు. నందికొట్కూ రులోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు.

మత్య్సకారులకు అవగాహన
మాట్లాడుతున్న జేడీ రాఘవరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు

నందికొట్కూరు రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అలివి వలలు వినియోగించి చేపలు పడితే మత్స్యకారుల లైసెన్స్‌లను రద్దు చేసి చర్యలు తీసుకుంటామని నంద్యాల షిషరీష్‌ జేడీ ఏవీ రాఘవరెడ్డి, నందికొట్కూరు తహసీల్దార్‌ శ్రీనివాసులు హెచ్చరించారు. నందికొట్కూ రులోని తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. 100 గ్రాముల చేప పిల్లలను కూడా పట్టివేస్తే ఎలా? అని, భవిష్యత్తులో చేపల ఉత్పత్తి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ సంవత్సరం దాదాపుగా 17 నుంచి 20 లక్షల చేప పిల్లలను నదిలో వదిలామని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతం లో దాదాపుగా 4 వేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధార పడి జీవిస్తున్నాయని చెప్పారు. అందుకే ప్రభుత్వం వారిని దృష్టిలో ఉం చుకొని మత్స్య సంపద అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే కొందరు అలివి వలలు వినియోగించి నష్టం కలిగిస్తు న్నారని చెప్పారు. కార్యక్రమంలో ఫిషరీష్‌ ఏడీ శ్యామల, ఎఫ్‌డీవో భరత్‌లాల్‌, డీటీ సత్యనారాయణ, వీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:01 AM