హోరాహోరీగా ఆదోని బార్ అసోసియేషన్ ఎన్నికలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:53 AM
పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాది శ్రీరాములు విజయం సాధించారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో దయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు.

అధ్యక్షుడిగా శ్రీరాములు విజయం, కార్యదర్శిగా జీవన్‌సింగ్
ఆదోని, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాది శ్రీరాములు విజయం సాధించారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో దయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి మధుసూధన్ రెడ్డి, శ్రీరాములు పోటీపడ్డారు. మొత్తం 303 మంది ఓటర్లు ఉండగా, 292 మంది ఓటు వేశారు. 95 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ ఇంత పోలింగ్ శాతం నమోదు కాలేదని న్యాయవాదులు చర్చించుకున్నారు. 6 గంటలకు ఓట్లను లెక్కించారు. శ్రీరాములుకు 192 ఓట్లు రాగా, మధుసూధన్ రెడ్డికి 91 ఓట్లు వచ్చాయి. దీంతో 101 ఓట్లతో శ్రీరాములు అఽధ్యక్షుడిగా ఘనవిజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి 303 మంది సభ్యులకు గానూ, 290 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకోగా, 4 ఓట్లు చెల్లలేదు. అనంతరం ఓట్లను లెక్కించారు. జె.వెంకటేశ్వర్లుకు 206 ఓట్లు రాగా, లోకేష్‌కు 80 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు చ్లెలలేదు. 126 ఓట్లతో వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. కార్యదర్శిగా జీవన్‌సింగ్‌కు 197 ఓట్లు రాగా, నెట్టెకంఠయ్యకు 88 ఓట్లు రాగా, 5 ఓట్లు చెల్లలేదు. 109 ఓట్లతో కార్యదర్శిగా జీవన్‌సింగ్ ఘనవిజయం సాధించారు. సంయుక్త కార్యదరిగా పోటీపడిన ఖలందర్‌కు 118 ఓట్లు రాగా, రాజారత్నంకు 167 ఓట్లు రాగా, 5 ఓట్లు చెల్లలేదు. 49 ఓట్లతో రాజారత్నం విజయం సాధించారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. విజేతలను న్యాయవాదులు సన్మానించారు. నూతన అధ్యక్షుడు శ్రీరాములు తనను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఎన్నికల సహాయ అధికారులుగా భాస్కర్ రెడ్డి, సోమశేఖర్, హనుమేష్ వ్యవహరించారు. టూటౌన్ ఎస్సై రామ్‌నాథ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.