Share News

Land Prices : భూముల కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:14 AM

రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 Land Prices : భూముల కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి

  • గ్రామాల్లో 5 నుంచి 10 శాతం పెంపు

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్‌ ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఐదేళ్లలో మూడుసార్లు భూముల మార్కెట్‌ ధరలు పెంచారు. కొన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25-30 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 5నుంచి 10శాతం మాత్రమే ధరలు పెంచినట్టు రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు తెలిపారు. డిమాండ్‌ బాగా ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు 20 శాతం వరకు పెరిగే అవకాశమున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్ల శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. మార్కెట్‌ ధరలు పెంచడం వల్ల ఫిబ్రవరి, మార్చిల్లో ఆదాయం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 03:14 AM