Share News

Nara Bhuvaneshwari: విజ్ఞానం వికాసానికి దోహదపడాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:17 AM

చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి, విజ్ఞానాన్ని విధ్వంసానికి కాకుండా వికాసానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. కేజీఎఫ్ గోశాలలో గోవుల దాహం తీర్చేందుకు స్వంత నిధులతో బోరు ఏర్పాటు చేశారు.

Nara Bhuvaneshwari: విజ్ఞానం వికాసానికి దోహదపడాలి

పథకాలు కొంచెం ఆలస్యమైనా.. అమలు మాత్రం పక్కా

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి

కుప్పం, అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): విజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి అని.. అలాంటి విజ్ఞానాన్ని విధ్వంసం కోసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాలుగు రోజుల పర్యటన కోసం విచ్చేసిన భువనేశ్వరి తొలిరోజైన బుధవారం గుడుపల్లె, కుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గుడుపల్లె మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ విద్యార్థులతో, అదే మండలం గుడిచెంబగిరి గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజ్ఞానాన్ని విధ్వంసానికి కాకుండా వికాసం కోసం వినియోగించాలని విద్యార్థులకు హితవు పలికారు. సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగదల కోసం చేస్తున్న కృషిని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుడిచెంబగిరి గ్రామంలో మహిళలతో భువనేశ్వరి ముచ్చటిస్తూ చంద్రబాబు నాయకత్వం మీద రాష్ట్రం మొత్తం ఎంతో నమ్మకం పెట్టుకుని అద్భుత విజయాన్ని కట్టబెట్టిందన్నారు. ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయరని చెప్పారు. పథకాలు కొంచెం ముందు వెనుక అవ్వొచ్చు కానీ, అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు. ప్రజలు కొంచెం ఓపిక పడితే అన్నీ నెరవేరుతాయని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. సాయంత్రం భువనేశ్వరి కుప్పంలోని పీఈఎస్‌ గెస్ట్‌ హౌస్‌లో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


కేజీఎఫ్‌ గోశాలలో సొంత నిధులతో బోరు

కర్ణాటకలోని కోలార్‌ జిల్లా కేజీఎఫ్‌ పరిధిలోని నంది గోశాలను భువనేశ్వరి బుధవారం సందర్శించారు. ఇక్కడ గోవుల దాహార్తిని తీర్చేందుకు సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోరును ఆమె ప్రారంభించారు. ‘నిజం గెలవాలి’ యాత్ర సమయంలో ఇక్కడకు వచ్చినప్పుడు గోవులు నీరు లేక అల్లాడుతున్న విషయాన్ని నిర్వాహకులు భువనేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆమె బోరు వేయించారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:17 AM