Oberoi Hotels: కేటాయించిన భూమి దివ్యక్షేత్రం పరిధిలో లేదు
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:09 AM
టూరిజమ్ పాలసీలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పేరూరులో తమకు ప్రభుత్వం భూమి కేటాయించిందని ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ప్రతినిధి రాజారామన్ శంకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌంటర్ వేశారు.

హైకోర్టులో ఒబెరాయ్ హోటల్స్ కౌంటర్
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘హోటళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకు కేటాయించిన 20 ఎకరాల భూమి తిరుమల దివ్యక్షేత్రం పరిధి వెలుపల ఉంది’ అని ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ హైకోర్టుకు నివేదించింది. టూరిజమ్ పాలసీలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పేరూరులో తమకు ప్రభుత్వం భూమి కేటాయించిందని ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ప్రతినిధి రాజారామన్ శంకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌంటర్ వేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమి టీటీడీ పరిధిలోకి రానందున వాటి రద్దుకు టీటీడీ తీర్మానం చేయలేదన్నారు. తిరుమల పవిత్రత, ఆధ్యాత్మికతను దెబ్బతీసేలా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. చట్ట నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని హోటళ్ల నిర్మాణానికి భూకేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టివేయాలని అఫిడవిట్‌లో కోరారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే