బొప్పాయికి చీరకట్టు..!
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:45 PM
వేసవి సీజన ప్రారంభదశలోనే ఎండలు దంచికొడుతున్నాయి.

పెద్దకడబూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వేసవి సీజన ప్రారంభదశలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పగటి వేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక పంటల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎండలతో బొప్పాయికి తెగుళ్లు సోకుతున్నాయి. మండలంలోని హనుమాపురం, మేకడోణ, కల్లుకుంట, గంగులపాడు, కంబలదిన్నె వంటి గ్రామాల్లో రైతులు బోప్పాయి సాగు అధికంగా చేశారు. వీటిని కాపాడుకునేందుకు ఆయా గ్రామాల రైతులు వినూత్నంగా ఆలోచించారు. పండ్ల తోటలను కాపాడుకునేందుకు ప్రతి చెట్టుకూ ఓ చీరను చుట్టి ఎండ పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
- పెద్దకడబూరు (ఆంధ్రజ్యోతి)