Share News

CSK vs RCB: బయటపడిన సీఎస్‌కే గుట్టు.. ధోని టీమ్‌కు వరుస ఓటములు తప్పవా..

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:13 AM

Chepauk Stadium: చెన్నై సూపర్ కింగ్స్‌ను వాళ్ల సొంతగడ్డ మీద ఓడించడం చాలా కష్టం. కానీ దీన్ని సాధ్యం చేసి చూపించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నిన్న ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన పోరులో ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

CSK vs RCB: బయటపడిన సీఎస్‌కే గుట్టు.. ధోని టీమ్‌కు వరుస ఓటములు తప్పవా..
IPL 2025

ఐపీఎల్‌లో టాప్ టీమ్స్‌లో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. దిగ్గజ ఆటగాడు ధోని నేతృత్వంలోని ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. అందునా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్‌కేను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అయితే అక్కడ ఆడిన 9 మ్యాచుల్లో ఒక్కసారి మాత్రమే ఎల్లో ఆర్మీని ఓడించింది. చెపాక్‌లో వరుస మ్యాచుల్లో గెలుస్తూ ప్లేఆఫ్స్‌కు దూసుకురావడం చెన్నై స్టైల్. అయితే ఇప్పుడు సీఎస్‌కే కోట బీటలు వారుతోంది. ధోని టీమ్ సీక్రెట్ ఏంటో ఒక్క మ్యాచ్‌తో బయటపడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


కౌంటర్ అటాకే మార్గం

చెపాక్ పిచ్ సాధారణంగానే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. ఫార్మాట్ ఏదైనా అక్కడ టర్నింగ్ ట్రాక్స్ ఎదురవుతాయి. దీన్ని ఉపయోగించుకొని క్వాలిటీ స్పిన్ అటాక్‌తో బరిలోకి దిగుతూ ప్రత్యర్థులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ వస్తోంది సీఎస్‌కే. అయితే నిన్నటి మ్యాచ్‌లో ఆ టీమ్ పప్పులు ఉడకలేదు. బాల్ టర్న్ అవుతున్నా గానీ ఆర్సీబీ బ్యాటర్లు కౌంటర్ అటాక్ చేశారు. అశ్విన్, జడేజాతో పాటు నూర్ అహ్మద్ మీదా దాడికి దిగారు. నూర్ వికెట్లు ఇస్తున్నా అతడి బౌలింగ్‌లో పరుగులు పిండుకోవడం మాత్రం ఆపలేదు. వీళ్ల ముగ్గురి బౌలింగ్‌లో కలిపి 9 ఓవర్లలో ఏకంగా 95 పరుగులు రాబట్టారు బెంగళూరు బ్యాటర్లు.


చిన్న ట్రిక్‌తో..

ఆర్సీబీ సెట్ చేసిన 196 పరుగులు టార్గెట్‌కు 50 పరుగుల దూరంలో ఆగిపోయింది సీఎస్‌కే. ఓవర్లన్నీ ఆడి 146 పరుగులకే పరిమితమైంది ధోని టీమ్. దీంతో చెపాక్‌లో 170 ప్లస్ స్కోరు సెట్ చేస్తే ఎల్లో ఆర్మీ చేజ్ చేయడం కష్టమని అంతా అంటున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిన్నటి మ్యాచ్‌‌లో మాదిరిగా ఫెయిలైతే ఆ టీమ్ పరిస్థితి ఇక అంతే అని చెబుతున్నారు. రచిన్ రవీంద్ర తక్కువ స్ట్రైక్‌‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తాడు.. దూబె పేస్ సరిగ్గా ఎదుర్కోలేడు, ధోని ఎలాగూ ఆఖర్లోనే వస్తాడు కాబట్టి భారీ టార్గెట్ సెట్ చేస్తే సీఎస్‌కే ఖేల్‌ఖతం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కౌంటర్ అటాక్ చేస్తే చెన్నై స్పిన్నర్లు ఏమీ చేయలేరని నెటిజన్స్ చెబుతున్నారు. చెపాక్‌ పిచ్‌ను అర్థం చేసుకోవడం, సీఎస్‌కే లైనప్‌ను బట్టి వ్యూహాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే గెలుపు ప్రత్యర్థులదేనని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీక్రెట్ గనుక మిగతా టీమ్స్ కూడా పట్టేస్తే చెన్నైకి వరుస ఓటములు తప్పవని హెచ్చరిస్తున్నారు.


ఇవీ చదవండి:

సీఎస్‌కేను ఓడించిన ధోని.. చిన్న తప్పుతో..

కోహ్లీపై ధోని DRS అప్పీల్.. రివ్యూ ఏమైందంటే..

ఫెడరర్‌‌ను దాటేసిన జొకోవిచ్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 11:29 AM