మహిళకు వింత అనుభవం.. బాయ్‌ఫ్రెండ్ కాస్తా బ్రదర్ అయ్యాడు.. ఎలా అంటే
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:41 AM
ఈ ప్రపంచం చాలా చిన్నది అంటారు. కొన్ని సంఘటనలు చూస్తే.. మరీ ఇంత చిన్నదా అని అనిపింకమానదు. అలానే కొన్ని సంఘటలను ఆశ్చర్యంతో పాటు భయం కలిగిస్తాయి. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. బాయ్‌ఫ్రెండ్ కాస్త తనకు బ్రదర్ అవుతాడని తెలిసి.. ఆమె షాక్‌కు గురయ్యింది.

సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. ఆశ్చర్యంతో పాటు కాస్త ఆందోళన కూడా కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన మహిళకు.. అంతకు మించి షాక్ తగిలింది. ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాల్సిన మహిళ.. గుండె పగిలిపోయే వాస్తవాలు తెలుసుకుని.. మరింత బాధపడింది. ఆమెను ఎక్కువగా బాధించిన అంశం ఏదంటే.. ఒకప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ అని భావించి.. ఎవరితో అయితే రొమాన్స్ చేసిందో.. అతడు కాస్త తనకు సోదరుడు అవుతాడని తెలిసి ఆ మహిళ కుంగిపోయింది. ఇంతకు ఈ కఠోర వాస్తవం ఎలా వెలుగులోకి వచ్చింది.. అసలేం జరిగిందంటే..
విక్టోరియా హిల్ అనే మహిళకు ఈ వింత అనుభవం ఎదురయ్యింది. కనెక్టికట్ అనే ప్రాంతానికి చెందిన విక్టోరియ తాజాగా బ్రిటన్ ఐటీవీ షో దిస్ మార్నింగ్‌లో పాల్గొన్నది. తనకు ఎదురైన భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చింది. విక్టోరియా మాట్లాడుతూ.. "కొన్ని రోజుల క్రితం నేను అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్సలో భాగంగా వైద్యులు ఆమెకు డీఎన్ఏ టెస్ట్ చేశారు. అది కాస్త ఆమె జీవితాన్ని తలికిందులు చేసింది" అని చెప్పుకొచ్చింది.
విక్టోరియాకు నిర్వహించిన డీఎన్ఏ టెస్ట్ వల్ల ఆమెకు ఓ సోదరి ఉందని తెలియడమే కాక.. గతంలో ఎవరిని అయితే తాను ప్రేమించి, రిలేషన్‌లో ఉందో ఆ వ్యక్తి కాస్త ఆమెకు సోదరుడు అవుతాడనే భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. దాంతో విక్టోరియా కుంగిపోయింది. అసలేం జరిగింది అంటే.. విక్టోరియాకు జరిపిన డీఎన్ఏ టెస్ట్ వల్ల ఓ ఫెర్టిలిటీ క్లినిక్ మోసం వెలుగు చూసింది.
యేల్ అనే ఫెర్టిలిటీ క్లినిక్‌లో పని చేసే డాక్టర్ వల్ల ఈ సమస్య వచ్చింది. క్లినిక్‌లో పని చేస్తున్న డాక్టర్.. తన స్పెర్మ్‌ను డొనేట్ చేశాడు. ఫలితంగా ఎందరో మహిళలు గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చారు. అలా జన్మించిన ఓ యువకుడినే గతంలో విక్టోరియా ప్రేమించింది. ఫెర్టిలిటి ఫ్రాడ్ వెలుగులోకి రావడంతో.. బాయ్‌ఫ్రెండ్ కాస్త బ్రదర్ అని తెలిసింది. అలానే కొందరు మహిళలు.. తమ తల్లిదండ్రులు కూడా అదే ఫెర్టిలిటి క్లినిక్‌లో చికిత్స పొందారని.. ఆరకంగా చూసుకుంటే.. తాము కూడా విక్టోరియాకు సిస్టర్స్ అవుతామని చెబుతూ ఈమెయిల్స్ చేస్తున్నారంట.
తనకు ఎదురైన ఈ అనుభవం గురించి టీవీ షోలో మాట్లాడుతూ.. "నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే ఉద్యేశంతో.. జనాల్లో అవగాహన కల్పించాలనే సంకల్పంతోనే నేను మీడియా ముందుకు వచ్చి.. నాకు ఎదురైన వింత పరిస్థితిని వివరిస్తాను. బ్రదర్ నాకు బాయ్‌ఫ్రెండ్ కావటాన్ని.. నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మీరు కూడా నాలాంటి పరిస్థితి ఎదుర్కోవద్దనే ఉద్దేశంతోనే ఈ విషయాలు చెబుతున్నాను" అని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఒక్కరికే దిక్కు లేదంటే.. ఒకే వేదికపై ఇద్దర్ని పెళ్లాడిన వ్యక్తి
మూలన పెట్టిన కూలర్ బయటకు తీశారా.. తిరగకపోతే ఇలా చేయండి..