Share News

Pawan Kalyan: 50% పచ్చదనం లక్ష్యం

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో పచ్చదనం 50శాతానికి పెంచడానికి, అటవీ అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఏపీ నగర వనాల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దార్శనీక నాయకత్వంలో అడవులు, పులుల కారిడార్‌ను బలోపేతం చేయడానికి, క్షీణించిన ఆవాసాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సహజ అడవులను అనుకరించే పట్టణ పచ్చని ప్రదేశాలను సృష్టించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 50 నగర వనాలు ఏర్పాటు చేయగా, 2024-25లో మరో 11 మంజూరయ్యాయని, అదనంగా మరో 12 నగర వనాల ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు.

Pawan Kalyan: 50% పచ్చదనం లక్ష్యం

50% పచ్చదనం లక్ష్యం

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెల్లడి

ఏపీ నగర వనాల లోగో ఆవిష్కరణ

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనం 50శాతానికి పెంచడానికి, అటవీ అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఏపీ నగర వనాల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దార్శనీక నాయకత్వంలో అడవులు, పులుల కారిడార్‌ను బలోపేతం చేయడానికి, క్షీణించిన ఆవాసాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సహజ అడవులను అనుకరించే పట్టణ పచ్చని ప్రదేశాలను సృష్టించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 50 నగర వనాలు ఏర్పాటు చేయగా, 2024-25లో మరో 11 మంజూరయ్యాయని, అదనంగా మరో 12 నగర వనాల ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు. అటవీకరణ, జీవ వైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించేలా పట్టణ ప్రాంతాల్లో నగరవాసులకు ఈ వనాలు సహజ అనుభవాన్ని అందిస్తాయన్నారు. ఈ హరిత చొరవను మరింత విస్తరిస్తూ, పిఠాపురంలో కూడా ఒక నగర వనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యతకు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసించారు.


రాష్ట్రంలో 76 పులులు ఉన్నట్లు నివేదిక

కార్యక్రమంలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ కోసం పులులు, ఆహారం, ఇతర క్షీరదాల స్థితిపై 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం పులుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను సూచించగా, ప్రస్తుతం పిల్లలు మినహా 76 పులులు ఉన్నట్లు నిర్ధారించారు. అడవుల్ని, వన్య ప్రాణుల్ని కాపాడితే.. భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుందని అటవీ ముఖ్య దళాధికారి ఏకే నాయక్‌ అన్నారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 04:10 AM