పెట్టుబడుల వరద
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:27 PM
వెనుకబడిన ప్రకాశం జిల్లాకు రూ.1.50లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో బుధవారం జరిగిన రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకే్‌షతో కలిసి ఆయన పాల్గొన్నారు.

జిల్లాలో రూ.1.50 లక్షల కోట్లతో పలు పరిశ్రమల ఏర్పాటు
త్వరలో కందుకూరు నియోజకవర్గంలో రూ.50 వేల కోట్లతో సోలార్ ప్లాంట్
మంత్రి గొట్టిపాటి రవికుమార్
పీసీపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన ప్రకాశం జిల్లాకు రూ.1.50లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో బుధవారం జరిగిన రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకే్‌షతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గొట్టిపాటి మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర సందర్భంగా జిల్లాకు వచ్చినప్పుడు ఈప్రాంతం వెనుకబడినతనాన్ని గుర్తించి అధికారంలోకి వచ్చిన 9నెలల్లోనే రూ.650కోట్లతో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌ను కనిగిరికి తెచ్చారన్నారు. అడవిలాంటి ప్రాంతాల్లో రైతుల మేలుకోరి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యా్‌స ప్లాంట్‌ను ఏర్పాటుచేయడం రాష్ట్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని చెప్పారు. ఇక్కడ సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లుగానే కందుకూరు నియోజకవర్గం పరిధిలో త్వరలో రూ. 50వేలకోట్లతో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని, ఆ తరువాత లక్షకోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ ప్లాంట్ ఏర్పాటు ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఈ ప్లాంట్‌ల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.
జగన్ ప్రభుత్వం పరిశ్రమలను వెళ్లగొట్టింది
మంత్రి గొట్టిపాటి
గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. దివాకరపల్లి వద్ద సభలో ఆయన మాట్లాడారు. 2019లో ఒక్కచాన్స్ అని అడిగితే.. ప్రజలు అవకాశమిస్తే అభివృద్ధిలో రాష్ట్రం 20సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 9నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇక్కడ అధికంగా పెన్షన్‌లు ఇస్తున్నామన్నారు. అలాగే ఉచిత ఇసుకను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు.
జిల్లా చరిత్రలోనే
కనిగిరికి ప్రత్యేక గుర్తింపు
సీబీజీ భూమిపూజ బహిరంగ సభలో మంత్రి స్వామి
పీసీపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా జిల్లా చరిత్రలో కనిగిరి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. పీసీపల్లి మండలం వెంగళాయపల్లి పంచాయతీ దివాకరపల్లి సమీపంలో బుధవారం సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ తన మొదటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను నియోజకవర్గంలో స్థాపించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చొరవ, మంత్రి లోకేష్ కృషి మరువలేమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేకమంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కృషే కారణమని స్పష్టం చేశారు. సభలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, దర్శి, యర్రగొండపాలెం ఇన్‌చార్జులు గొట్టిపాటి లక్ష్మి, గూడూరు ఎరిక్షన్‌బాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, వెంగళాయపల్లి సర్పంచ్ కరణం తిరుపతయ్య ఉన్నారు.