మొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:38 AM
ఆరుగా లం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన స మయానికి ధర రోజురోజుకు దిగజారుతుండ టంతో మొక్కజొన్న పంటను పండించిన రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట చేతికొచ్చే సమయంలో ధర పతనం
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతుల వినతి
చీమకుర్తి, ఏప్రిల్3(ఆంధ్రజ్యోతి) : ఆరుగా లం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన స మయానికి ధర రోజురోజుకు దిగజారుతుండ టంతో మొక్కజొన్న పంటను పండించిన రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులు రంగప్రవేశం చేయటంతో ప్రభుత్వం ప్రకటిం చిన మద్దతు ధర కన్నా తక్కువకు ధర పడి పోయింది. కందులను మార్క్‌ఫెడ్ ద్వారా మ ద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావటంలో జాప్యం జరుగుతుండ టం దళారులకు వరంగా మారింది. మొక్కజొ న్నలు కొనుగోలుకు మార్కెట్‌లో అంతగా డి మాండ్ లేదంటూ రైతులను మభ్యపెడుతూ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత నిల్వ చేయటం కష్టంగా మారటంతో రైతులు చేసేదేమి లేక మద్దతు ధ ర కన్నా తక్కువ రేటుకే అమ్ముకొంటున్నారు. దీనికి తోడు రాబోయే రెండురోజుల్లో వర్షం ప డుతుందని వాతావరణశాఖ నుంచి వస్తున్న వార్తలు మొక్కజొన్న రైతులను మరింత ఆందో ళనకు గురిచేస్తున్నాయి. పంట చేలో ఆరబోసి న ధాన్యాన్ని వర్షం పడితే తడవకుండా చేయ టం కష్టమని రేటు తగ్గినా అమ్ముకోవాల్సిన ప రిస్థితి ఏర్పడింది. చీమకుర్తి మండలంలో ప ల్లామల్లి, గాడిపర్తివారిపాలెం, నేకునంబాదు, ఇలపావులూరు, గోనేపల్లివారిపాలెం తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రబీ సీజన్‌లో ముందస్తుగా సాగు చేశారు. ఈ పంటకు ఇపుడు కోత సమయం ఆసన్నమయి ముమ్మరంగా కోతలు సాగుతు న్నాయి. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉం డటంతో రైతులు సంతోషంగా ఉన్న రైతులకు రోజురోజుకు దిగజారుతున్న ధర దిగాలు రేపు తోంది. వచ్చే లాభాలు కాస్తా కళ్ల ముందే ఆవి రి అవుతుండంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధరగా రూ. 2,225ను నిర్ణయించారు. ఇటీవల వరకూ మద్దతు ధరకు పైనే కొనుగోలు జరిగాయి. కా ని వారం రోజుల నుంచి ధర తగ్గుతూ వచ్చి ప్రస్తుతం రూ.2050కు అటుఇటూగా వ్యా పారులు కొనుగోలు చేస్తున్నారు. అదీ తేమశా తం అంటూ వంకలు పెడుతుండటమే కాకుం డా కొనుగోలు చేసిన తర్వాత రైతుకు డబ్బులు ఇవ్వటానికి వారంరోజులకు పైగా గడువు పెడుతుండటం గమనార్హం. మార్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులకు మద్ద తు ధర ఇవ్వటమేకాక 48గంటలలోనే నగదు ను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. మొక్క జొన్నలను కూడా ఇదేరీతిలో కొనుగోలు చేయా లని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీ నిపై ఆంధ్రజ్యోతి మండల వ్యవసాయశాఖాధి కారి భాస్కర్‌ను వివరణ కోరగా.. మొక్కజొన్న లను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు అనుమతి కోసం ప్రభుత్వానికి ఉన్నతాధికారు లు నివేదించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కొనుగోలు ప్రక్రియ చేప డతామని చెప్పారు.