గృహనిర్మాణాల పురోగతికి రూ.5 కోట్లు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:24 AM
గత ప్రభుత్వంలో మంజూరైన గృహాలు నిధుల కొరతతో నిలిచిపోయా యని జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. గృహనిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.5 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశహాలులో తాళ్లూరు, ముండ్లమూరు మండలాల హౌసింగ్ ఎంఐసీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్
తాళ్లూరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో మంజూరైన గృహాలు నిధుల కొరతతో నిలిచిపోయా యని జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. గృహనిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.5 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశహాలులో తాళ్లూరు, ముండ్లమూరు మండలాల హౌసింగ్ ఎంఐసీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిలిచిన గృహ నిర్మాణాల అసంపూర్తి పనులు పూర్తిచేసి పురోగతి సా ధించేందుకు ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. వీ టితోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ ద్వారా ఆయావ ర్గాల లబ్ధిదారులకు అదనంగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బీసీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.75 వేలు, ఎస్టీలకు లక్ష రూపాయల చొ ప్పున అదనంగా అందజేస్త్నుట్టు తెలిపారు. మేనెల 3వ తేదీనాటికి జిల్లాలో 8,839 అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే 2620 గృహనిర్మాణాలు పూర్తిచేసినట్టు చెప్పారు. నిధులకు కొరత లేనందున లబ్ధిదారులు త్వరిగతిన గృహనిర్మాణాలు పూర్తిచే యాలన్నారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు బిల్లులు జమ చేస్తామన్నారు. గ్రామాల్లో గృహాలు నిర్మించుకోని వారిని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రోత్సహించాలన్నారు. నిఽధుల కొరత లేదన్న విషయాన్ని తెలియపరిచి త్వరితగతిన పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. పీఎం ఆమోస్ యోజన కింద మండలంలో 435 గృహాలు మంజూరయ్యాయని చెప్పారు.
ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వా రా ప్రభుత్వం పెద్ద ఎత్తున పే దవర్గాలకు గృహాలు మంజూరు చేస్తున్నదన్నారు. జడ్పీటీసీ మా రం వెంకటరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతనిఽధులను అ ధికారులు సమన్వయం చేసుకుని, వారి సహకారంతో గృహ నిర్మాణాలు వేగవంతంగా పూ ర్తి చేయాలన్నారు. కార్యక్రమం లో ఎంపీడీవో దారా హనుమంతరావు, ఎంఐసీ హనుమంతరావు, కార్యాలయ పర్యవేక్షకులు ఎస్.సత్యం, రజానగరం సర్పంచ్ కాలేషావలి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పీడీ శ్రీనివాసప్రసాద్‌ను ఎంపీపీ తాటికొండ, జడ్పీటీసీ మారం సత్కరించారు.
అనంతరం తాళ్లూరులోని ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. గృహనిర్మాణాలు చేపట్ట్టని లబ్ధిదారులు గృహనిర్మాణాలు చేపట్టాలన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనేపూర్తి చేసి బిల్లులు పొందాలని లబ్ధిదారులకు సూచించారు.