Share News

పేరుకుపోయిన ఇంటి పన్నుల బకాయిలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:50 PM

సామాన్య ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే ఇంటి పన్నులు చెల్లించడంలో జాప్యం చేస్తే అధికారులు హడావుడి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఆ నిబంధనలు వర్తించవనుకున్నారేమో లేదా పన్నులు చెల్లించకపోతే తమను ఎవరు ప్రశ్నిస్తారులే అనుకున్నారో ఏమో కానీ పన్నులు చెల్లించటం మానేశారు. తీరా ఆ బకాయిలు నేడు లక్షల రూపాయల్లో పేరుకుపోయాయి.

పేరుకుపోయిన ఇంటి పన్నుల బకాయిలు
దొనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం

పట్టనట్టుగా ప్రభుత్వ

కార్యాలయాల అధికారులు

పంచాయతీ అభివృద్ధికి

నిధుల కొరత

దొనకొండ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే ఇంటి పన్నులు చెల్లించడంలో జాప్యం చేస్తే అధికారులు హడావుడి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఆ నిబంధనలు వర్తించవనుకున్నారేమో లేదా పన్నులు చెల్లించకపోతే తమను ఎవరు ప్రశ్నిస్తారులే అనుకున్నారో ఏమో కానీ పన్నులు చెల్లించటం మానేశారు. తీరా ఆ బకాయిలు నేడు లక్షల రూపాయల్లో పేరుకుపోయాయి. గ్రామాల అభివృద్ధికి ఇంటి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. ఇంటి పన్నులు సకాలంలో వసూళ్లు జరిగితే పంచాయతీలో అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఇంటి పన్నులు నూరుశాతం వసూళ్లు చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు గ్రామ కార్యదర్శితో పాటు సచివాలయాల సిబ్బందికి సహితం ఆ బాధ్యతలను అప్పగించింది. మండల కేం ద్రమైన దొనకొండ మేజర్‌ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నుల బకాయిలు అర కోటికి పైగానే ఉన్నాయి. ప్రభు త్వ కార్యాలయాల భవనాలకు చెందిన ఇంటిపన్నుల బకాయిలు దాదాపు రూ.22 లక్షలు ఉన్నాయి. గృహాలకు చెందిన పెండింగ్‌ బకాయిలు దాదాపుగా రూ.30 లక్షలు పేరుకుపోయాయి. విద్యుత్‌శాఖ రూ.3,58,044, తహసీ ల్దార్‌ కార్యాలయం రూ.2,35,936, సివిల్‌ సప్లయ్‌ గోడౌ న్లు రూ.4,17,629, కేజీబీవీ పాఠశాల రూ.1,20,732, వెలు గుశాఖ రూ.95,428 బకాయి ఉంది. అలాగే, ఎస్సీ బాలుర హాస్టల్‌ రూ.1,03,863, బీసీ బాలుర హా స్టల్‌ రూ.25,872, గృహ నిర్మాణశాఖ రూ.53,105, పశువైద్యశాల రూ.58,587, ఎస్సీ బాలుర హాస్టల్‌- 2 రూ.1,07,035 చెల్లించాల్సి ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం రూ.1,10,415, రిలయన్స్‌ టవర్‌ రూ. 38,127, యూటీఎఫ్‌ ఆఫీస్‌ రూ.20,281, మల్లెల సుబ్బరాయుడు బిల్డింగ్స్‌ రూ.95,327, పోలీస్‌స్టేష న్‌ రూ.1,62,073, ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌ రూ.42,453, బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ రూ.48,661మేర బకాయిలు పేరుకుపోయాయి.

గత వైసీపీ ప్రభుత్వం ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో భారీగా బ కాయిలు పెరిగిపోయినట్లు సమాచారం. దీంతో దొనకొం డ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో, పారిశుధ్యం తరలించే ట్రైసైకిళ్లు, తడి, పొడి చెత్త వాహనం మరమ్మ తులకు గురై మూలనపడటం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటంను ప్రజలు చర్చించుకుం టున్నారు. ప్రస్తుతం వీటి వసూళ్లు పంచాయతీ సిబ్బం దికి కత్తిమీద సాములా మారింది.

Updated Date - Mar 28 , 2025 | 11:50 PM