Share News

కందిపప్పు కష్టమే

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:14 AM

ల్లాలో మంగళవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. అందుకు అవసరమైన ఏర్పా ట్లను ఆ శాఖ అధికారులు చేశారు. అయితే మూడు నెలల నుంచి కంది పప్పు సరఫరా కావడం లేదు. దీంతో కేవలం బియ్యం, పంచదార పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్డుదా రులకు కందిపప్పు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.

కందిపప్పు కష్టమే

మూడు నెలల నుంచి నిలిచిన సరఫరా

ఈసారి కూడా జిల్లాకు రాని సరుకు

బియ్యం, చక్కెర మాత్రమే అందజేత

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. అందుకు అవసరమైన ఏర్పా ట్లను ఆ శాఖ అధికారులు చేశారు. అయితే మూడు నెలల నుంచి కంది పప్పు సరఫరా కావడం లేదు. దీంతో కేవలం బియ్యం, పంచదార పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్డుదా రులకు కందిపప్పు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక బియ్యం, చక్కెర, కందిపప్పుతోపాటు చిరుధాన్యా లను కూడా సరఫరా చేస్తామని ప్రక టించారు. ఆతర్వాత రెండు, మూడు నెలలు కందిపప్పుతోపాటు జొన్నలు కూడా ఇచ్చారు. దీంతో కార్డుదారులు తమకు అన్నిరకాల సరుకులు దొరుకు తాయని ఆశించారు. నవంబరులో 70 శాతం కందిపప్పును ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. డిసెంబరులో అసలు ఇవ్వలేదు. జనవరి, ఫిబ్రవరిల్లోనూ అదే పరిస్థితి కొనసాగింది. తాజాగా ఏప్రిల్‌ 1నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభమ వుతుండగా ప్రభుత్వం జిల్లాకు కేవలం బియ్యం, చక్కెరను మాత్రమే పంపింది. వాటిని అధికారులు రేషన్‌ షాపులకు తరలించారు.

Updated Date - Apr 01 , 2025 | 01:14 AM