రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బూదవాడ విద్యార్థులు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:21 AM
వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈఎండీపీ)పై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో బూదవాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి 21వ శతాబ్దపు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా చీరాలలోని ఎన్‌ఆర్‌పీఎం ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ పోటీలను నిర్వహించారు.

పంగులూరు, ఏప్రియల్ 2 (ఆంధ్రజ్యోతి) : వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈఎండీపీ)పై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో బూదవాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి 21వ శతాబ్దపు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా చీరాలలోని ఎన్‌ఆర్‌పీఎం ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 10 ప్రాజెక్ట్‌లు ప్రదర్శించగా, బూదవాడ ఉన్నత పాఠశాలకు చెందిన కె.జగన్మోహనరెడ్డి, బి.చంద్రారెడ్డి, కె.కోటేశ్వరరావు ఆయుర్వేద మెడిసన్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ (ప్రకృతివైద్యం)పై చేసిన ప్రాజెక్ ్ట ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపిక కాగా చీరాల ఎన్‌ఆర్‌పీఎం పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన ధన్వంతరి దంతసిరి (పళ్లపొడి) ప్రాజెక్ట్ ద్వితీయ ప్రాజెక్ ్టగా ఎంపిక చేశారు. ఈ రెండు స్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బూదవాడ ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ సుధారాణి తెలిపారు. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను హె చ్‌ఎం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.