Share News

మత్య్సకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:00 AM

తీర ప్రాంతంలో వేటతో జీవనం సాగిస్తున్న మత్య్పకార సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నట్లు నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మత్య్సకారులకు అందించే డీజిల్‌ సబ్సిడీ కార్డులను స్వయంగా అందజేశారు.

మత్య్సకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక
మత్య్సకారులకు డీజిల్‌ సబ్సిడీ కార్డులను అందజేస్తున్న డాక్టర్‌ మహేంద్రనాథ్‌

టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్‌

చీరాల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : తీర ప్రాంతంలో వేటతో జీవనం సాగిస్తున్న మత్య్పకార సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నట్లు నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మత్య్సకారులకు అందించే డీజిల్‌ సబ్సిడీ కార్డులను స్వయంగా అందజేశారు. ఈసందర్భంగా స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం, టూరిజం వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. అలాగే నిషేధ కాలంలో భత్స్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:00 AM