సముద్రంలో గల్లంతైన యువకుడు మృతి
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:50 PM
సింగరాయకొండ పాకల తీరంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన టంగుటూరు మండలం ఎం.నిడమనూరు గ్రామానికి చెందిన చాట్రగడ్డ సిసింద్రీ(27) మృతిచెందాడు.

మన్నూరు తీరంలో మృతదేహం లభ్యం
సింగరాయకొండ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పాకల తీరంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన టంగుటూరు మండలం ఎం.నిడమనూరు గ్రామానికి చెందిన చాట్రగడ్డ సిసింద్రీ(27) మృతిచెందాడు. అతని మృతదేహం మన్నూరు సముద్రతీరంలో గురువారం లభ్యమైంది. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీస్ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.
చేపల కోసం వెళ్లి యువకుడి మృతి
పొన్నలూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన నూకతోటి చిరంజీవి (24) బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలోని పాలేరులో చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ వాగులోపడి బుధవారం ఉదయం మరణించాడు. పుట్టుకతో మూగ, చెవిటి అయిన చిరంజీవి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో చిరంజీవి అన్న అంకమ్మరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలించి చిరంజీవి మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. అంకమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై అనుక్ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.